పుట:Srinadhakavi-Jeevithamu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

శ్రీనాథకవి


వల్లభరాయనికీ: జేరువకాలమునందున్న వారగుటచేత నాతని గూర్చి యెక్కువగా దెలియఁదగికవారును నైన చిత్రకవి పెద్దన్న, ముద్ద రాజు రామన్న, శ్రీధరుఁడు మొనలైన లక్షణగంథకర్తబూర్వోక్తపద్యద్వయమును వల్లభరాయనివనియే తమతమ లక్ష్మణగ్రంధములయం దుదాహరించి యుండఁగా నల్లభరాయని కిన్నూఱుసంవత్సరములకు వెనకనుండిన యప్పకవియవి శ్రీనాథుని వనుట యజ్ఞానమూలమునఁ గాని తెలిసి చెప్పుట చేతగాను. వల్లభరాయని సందర్శింపబోయి నప్పుడాతఁడు క్రీడాభి రామమును రచించుచుండఁ గాఁ జూచియుండుటచేతనో తత్పద్యరచనమునం దాతనికిఁ దోడుపడి యుండుట చేతనో శ్రీనాధుఁకుతాను తరువాత రచించిన భీమఖండము సందు సంస్కృతశ్లోకమును దెనిగించుచు 'గార్గ్యసిద్ధాంతమత' మన్న పద్యములోఁ గొంతభాగ మట్లే వేసియుడవచ్చును. అంతకంతముచేతఁ బుస్తక మంతయు శ్రీనాథవిరచిత మనుట యతిసాహసము" అనిసమాధానము వ్రాసియున్నారుగదా! శృంగార దీపిక శ్రీనాథకృత మనుటకు శ్రీనాథుని శాసనములలోఁ గన్పట్టెడి శృంగార దీపికలోని 4, 5శ్లోకములు రెండు మాతమే యాధారములుగా నున్నవని దెలిపెడిశ్రీవీరేశలింగముగారు, శ్రీనాధుని శాసనములలోని శ్లోకములకే భేద మించుకయు లేక సరిగా నిందుఁగనఁబడుచున్నందున శ్రీనాధుఁడే శృంగారదీపికను రచించియుండు' నని సాహసించి చెప్పఁ గలిగినను, అట్టి సాహసము క్రీడాభిరామము పట్ల కలుగకున్నది. అప్పకవి యీ రెండు పద్యములను శ్రీనాధుని వీధినాటకములోని వనుటకు నజ్ఞానమే కారణ "మైనయెడల నెవరో పుల్లయ్య వీదినాటక మనక శ్రీనాథుని వీధినాటక ములోనివని యెందుకనవలయును? ఈ రెండు పద్యములు శ్రీనాథునివీధి నాటకమని వ్యవహరింపబడెడి జవాబు. గ్రంథములోఁగూడ నున్నవి గదా. అప్పకవినాటికే శ్రీనాథుఁడు వీధినాటకము రచించెనను సంగతి