పుట:Srinadhakavi-Jeevithamu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము

180


దంటకపులుగబలుపైన యింటిమగడ
గవుల వాదంబు విని వేడ్కంగల్గెనేని
నన్నుం బిలిపింపు మాస్థానాన సన్నిధికిని
లక్షణాపేంద్ర ప్రౌడరాయక్షితీంద్ర


ప్రౌఢ దేవరాయలు వీరితని దర్పమును జూచి యూశ్చర్యపడుచు దాను పేక్షించుటఁ దన యాస్థానవిద్వడ్బృదమునకు నగుబా టుగునని యెవ్వరిమాటలను సరకుగొనక యాతని దన యాస్థానమున కాహ్వా నించెను. తరువాత నాతని కోరికను 'దెలిసికొని యొక విద్వత్సభను కూర్పించెను. కర్ణాటసామ్రాజ్య సార్వభౌముఁ డగుప్రౌఢ దేవరాయల సన్నిధానమునఁ గవితావిషయముస శ్రీనాథకవి భట్టారకునకును, డిండిమ కవిభట్టారకునకును వైరము వర్దిల్లి పిజిగీషువులై వారిరువురును చర్చకు దొరకొనిరి. వారెందునుగూర్చి యట్టియుద్భుటవివాదమును పెట్టుకొ నిరో తెలియదు గాని డిండిమభట్టారకునకున్న కవిసార్వభౌమ బిరుద మును శ్రీనాథుఁడుగూడ వహించుటచేత గలిగినదని యూహింపవచ్చును. " బిరుదులు నారివాగుకడఁ బెట్టితి సత్కవిసార్వభౌముఁడ " అనునదియే మూల కారణము. అరుణగిరినాధ డిండిమభట్టారకుని మనుమఁడగు రాజ నాధభట్టారకునితోబాటుగా నచ్యుత దేవ రాయల వారి యాస్థానకవు లలో నొక్కడగు రాధామాధవకవి.


 శా, సూనాస్త్ర, ప్రమదా మద స్పురితత వక్షో జాత కాఠిన్యమున్
బూనంజాలు వరోవిలాసమున నింపుల్ మీఱ గర్ణాటక
క్ష్మానాథేంద్రు, సభన్ జా గవిత్వ విజయోత్సాహంబు కై కొన్న మా
శ్రీ నాధుం గవిసార్వభౌముఁ గొలుతున్ సేవాంజలుల్ గీల్కొనన్


కవిత్వ విజయము కొఱకే యీపోరాటమని సూచించియున్నాఁడు. ఈవివాదమునందుఁ గర్ణాటరాజ్యసార్వభౌములకుఁ గులగురు వయిన 'చంద్రభూషక్రియాశక్తి ' యొడయఁడు మధ్యవర్తిగ నుండెను. ఈవివాదములో మాధ్యస్థ్యము నెఱిపిన చంద్రభూష క్రియాశక్తి పండి