పుట:Srinadhakavi-Jeevithamu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము

177

.

తనమాటనిలిచి పసుల గట్టివైచి పాలకు విడువ డయ్యెను. అంతట నరుగ గిరినాధుడాసంగతి రాయలకు నివేదించి 'దేవరా నీతోటపట్టు నాగ్ర హారముగా దానము చేయుము. అట్లు చేసుకుంటినేని నప్పుడే సీరాజ్య ముకు విడిచిపోయెద సని పలికెనఁట. అందునకు గాను బిట్లు ప్రత్యుత్తు మిచ్చెను. " అది ప్రమదావంబగుటచే నీయంబడదు. ఇతరస్థలమున నొసం గెదనని పలికెనుగాని యతడు కోపించి ఢిల్లీ నగరమునకుఁబో మెనఁట, ఢిల్లీ సురత్రాణుని దర్శనము సామాన్యముగా లభించుననీ కాదు గనుక దుర్గ ద్వారమున నొకశ్లోకమును వ్రాసెనట.సుకత్రాణా! నీరాణి చెంతనిద్రింప ననుదెంచితి అనుసర్దనముగల యాశ్లోకమును అసూయాళువు లగుపండితుతు లాసంగతిని సురాత్రాణుని కెఱింగించిరి. అతఁడా గ్రహ చిత్తుఁడై వాని కోమరిత మరిత లవంగియనునది వానిని వారించి 'నాయనా! నీయాశ్రయము కోరివచ్చిన కవీశ్వరుఁ డెన్నడు నట్లు వ్రాసియుండఁడు; దాని కెది యో మఱియొక యుర్దదముండును; వానిరప్పించి విచారింపు' డని పలికెనఁట. అతఁడా మెపలుకులనాదరించి రప్పించి విచారింపఁగా నరుణగిరినాథకవి యాలంకారికుల పద్ధతి నను స రీచిచి యుత్తరార్థమునుబూరించి శ్లోకముఁజదివి నీధాటివలని భయ ముచేఁ బర దేశములందు నిద్రాభావము గలిగినందున నీరాణీ చెంత నిదు రింప నరుదెంచితి; రాణి అనఁగా నిచటపరి పాలిత దేశమని యర్ధము. అంతీయగాని విపరీ తార్దమిందేమియు లేదనునుడివెనట. ఢిల్లీ సురత్రా ణుని యాస్థానమున 'అన పోయుఁ" డను కవిమల్లుఁడు గలఁడఁట. అతఁడు జయనూపురమును బాదరమున ధరించి డిండిమ వాద్యముతోఁ బూజితుఁ డై యుండెనఁట, అతఁడీయరుణగిరినాధునిఁ బ్రవేశమున కసమ్మతిని గనుపఱచె. అంతనిర్వురకు వివాద మేర్పడియెను. సర్వశాస్త్రములు యందు విచారముజరిగెను. ఇరు వదిమూడు దినములు చర్చసాగెను. కడ పటఁ గవిమల్లుఁడు నిగ్రహింపబడియెను. ఢిల్లీ సురత్రాణుడు సంతోషించి