పుట:Srinadhakavi-Jeevithamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాధ్యాయము

11


జెప్పియుండ వలయును. తన కాశ్రయులుగా నుండు కొండవీటి రెడ్లు, రాజమహేంద్ర పురపు రెడ్లు, తెలుగు రాయఁడు, మైలార రెడ్డి "మొదలు గాఁ దన ప్రభువు లెల్లను, తన్నెఱిగిన మిత్రులను మంత్రిపుంగవు లును స్వర్గస్థులుకాఁగా నీతఁడు దుర్దశ పాలై కన్నడ రాజ్యమునకు లేచిపోయి తనకు సమ్మానము జరుగకున్నప్పుడు చెప్పినపద్యమై యుండ వలయును. ఏమున మున్నొక తూరి నిండు యౌవనమునఁ గర్ణాట రాజ ధానికిఁ బోయి కవిసార్వభౌముఁడైన డిండిమ భట్టారకుని నోడించి దేవ రాయలముత్యాల శాలలో స్వర్ణాభిషేక మహోత్సవమును బడసిన వాడని యెఱుఁగక కాలస్థితిని బట్టీ యుపేక్షించియుండ వారలకు

జప్తికిఁ దెచ్చుటకై తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మీ ! అప్పుడే నన్ను మఱచి పోయితివా? నామీద డయలేదా? ఇచ్చట ముత్యాలశాలలో స్వర్ణాభిషేక మనుభవించిన శ్రీనాథుఁడన. జుమీ " యని పలికిజ్ఞప్తికిఁ దెచ్చిన విషయముగా భావింపవలయునే గాని దీనింబట్టి యీతఁడు కర్ణాటకుడనిగాని యీతని జన్మ దేశముక్క కర్ణాటమని గాని చెప్పసాహసింపరాదు.[1]

  1. ఆ పయిపద్యమునే శ్రీవీరేశలింగము గారు మఱియొక సందర్భమున దాము నూతనముగా బెంచి వ్రాసిన గ్రంథములో . నుదాహరించును. పయిపద్యము లో తల్లీ! కన్నడ రాజ్య లక్ష్మీ!' యని కర్ణాటక దేశము సంబోధింపఁ బడియుండుటను బట్టి, శ్రీనాథుఁడు కర్ణాట దేశస్థుఁడని యేకానొకరు విషయవిచారము చేయక వ్రాసిరిగాని యుది గ్రాహ్యము కాచు' అని చులకనగా ద్రోసి వేసి నాసిద్ధాంతము నంగీకరించి యున్నారు. ఆంధ్రకవుల చరిత్ర వ్రాసిన శ్రీవీరేశ లింగము గారికిఁ బల్నాటివీర చరిత్రపీ ఠికలో శ్రీనాథుఁడు కర్ణాటకుఁడని శ్రీయుమా కాంతము గారు చేసిన సిద్ధాంతము నిర్భాన క మైనదిగాఁ గానుపించి శ్రీ నాథుఁడు సాళ్వనరసింహరాయని యూస్థానకవియైన డి. డిమ భట్టాకమని నోడించి నాడని శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు క్రీడాభిరామ పీఠిక లో నేప్పుడో వ్రాసిన యభిప్రొమము మహాఘోర మైనది గాఁ గానుపించెను గాఁబో లు! అందుకొఱకు కొన్ని పుటలు వ్రయ పెట్టఁగిలినవా రిందునుగూర్చి పాప మొక్క- వాక్యమును మాత్రము చెప్పి ముగించిరి,