పుట:Srinadhakavi-Jeevithamu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

శ్రీనాథకవి

164


అని వర్ణింపబడి యున్నాడు. భీమేశ్వరపురాణము రచించు నాటికీ వీరభద్ర వేమపృధ్వశ్వరుల రాజ్యము సింహాద్రి పర్యంతము మాత్రమె వ్యాపించి యుండినను కాశీ ఖండము రచించునాటికి చిల్క సముద్రము వఱకు వ్యాపించినట్టు గన్పట్టుచున్నది.అన్నా మాత్యుఁడు బహుభాషల నేర్చి రాజస్తానమునకు వివిధ దేశములనుండి యే తెంచిన రాయ బారులతో వారివారి భాషలతోనే ప్రసంగములు సలుపుచుండు సనియు, పారసిభాష చక్కగ వాయునట్టి వ్రాయస కాడనియు, బహమనీసుల్తా నగుఅహమదుపాతో నుత్తర ప్రత్యుత్తరములు జగుపు చుండు వాడనియు, శ్రీనాథకవివ రేణ్యుఁడీ క్రింది పద్యములలోఁ జెప్పి వర్ణించియున్నాడు.

</ఆరబీభాష, తురుష్క భాష, గజకర్ణాటాంధ్ర గాంధార ఘూ
ర్జర భాషల్" మళయాళ భాష కక భాషా సిందుధు సౌవీర బ
క్బర భాషల్ క హాటభాష మఱియుం భాషావి శేషంబు ల
చ్చేరు వైవచ్చున రేటియన్న నికి గోష్టీ సంప్రయోగంబులన్".

ఉ. అన్నయమంత్రి శేఖకుఁర డహమ్మదు శాసనదానభూమి భృ
త్సన్నిధికి స్మడిస్సముగ వేమ మహిమహసురేంద్ర రా
జ్యోన్నతి సంతతాభ్యుదయ మొందగల పౌరసీ భాష, వాసినం
గన్నులపండువై యనుగు గాకితమందలి వర్ణ పద్ధతుల్ •


శ్రీనాథకవి రాక.

పెదకోమటి వేమభూపాలుడు స్వర్గస్థుఁడయిన వెనుక సకలవిద్యా సనాథుఁడగు శ్రీనాధుఁడు కర్ణాట సామాజ్య సార్వభౌముఁ డగు ప్రౌఢ దేవరాయనికి సామంత సృపతులుగనున్న తెలుఁగురాయనికడఁ గొంత కొలమును, పంటమైలారు విభునికడఁ గొంత కాలమునుగడపి రాజమ హేంద్ర పుర రాజ్యము ప్రవర్ధమానముగ సుండుటయు, తనకు మిత్రు డును బాంధవుఁడు నగు బెండపూడి అన్నామాత్యుఁడు వేమవీరభద్ర పృధ్వీశ్వరులకు మంత్రియై, పండిత పక్ష పాతియై, విద్యాభిమానియై,