పుట:Srinadhakavi-Jeevithamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11

శ్రీనాథకవి

. ఇట్టి పట్యములింకను గలవు కర్ణాట దేశమనఁగా నంధ్ర దేశమని కాని కర్ణాట భాషయన నంధ్రభాషయని కాని శ్రీనాథుని కభిప్రాయము లేనట్లు పై పద్యముల వలన స్పష్టము కాఁగలదు". కాఁబట్టి యంధ్ర భాషను కర్ణాటభాషయని శ్రీనాథుఁ డన్నాడనుట వాస్తవము కాదు'

ఇంక మూఁడవ హేతువును విచారింతము..

తల్లీ ! కన్నడ రాజ్య లక్ష్మి! దయ లేదా నేను శ్రీ నాథుడన్

అనునది ఇది యీ క్రింది చాటువులోనిది.

శా. కుళ్ళాయుంచితిఁ గోక జుట్టితి మహాకూర్వాసముం దొడ్డితిన్,
వెల్లుల్లిం దీలపిష్టము న్మెసవితిన్ - విశ్వస్త వడ్డింపఁగా
జల్లాయంబలిఁ ద్రావితి ? రుచుల్" దోషంజంచుఁ బోనాడిన్ ,
తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మి! దయ లేదా ! నేను శ్రీనాధుఁడన్

ఈ చాటు పద్యము నిజముగా శ్రీనాథుఁడు రచించెనో లేక మఱీ యాతని పేరితో మఱియెవ్వఁడైన రచించెనో తెలిసికొనుట కాధార మేమియు లేదు.

ఈతఁడు కర్ణాట రాజ్యలక్ష్మిని 'తల్లీ' యని సంబోధించినాఁడుగనక నీతని జన్మ దేశము కర్ణాట దేశమై యుండునని యూహ, ఈ చాటువును శ్రీనాథకవి సార్వభౌముఁడే చెప్పి యుండునని తప్పక మన మొప్పుకోవల సినయెడల మిక్కిలి దైస్య స్థితియందున్న కౌలమునఁ జెప్పి యుండవలయునని తలంప వలయును. బాల్యస్థితి మనకంతగాఁ దెలియకపోయినను యుక్తవయస్సు వచ్చినది మొదలుకొని వయస్సు ముదిరి దేహ పటుత్వము సడలు వఱకు నీతడు మహా రాజుల యాస్థానముల నుండి పండిత కవియై ప్రసిద్ధికెక్కి వారల ప్రాఫున మహా రాజు భోగము లనుభవించుచు వచ్చిన వాడగు కుటకు సంశయింపం బనిలేదు. ఇట్టి దైన్యస్థితి యవసాన కాలమునఁ దటస్థించి యుండెనని యపవాదులు గలవు గాని యౌవన కాలమునఁ దటస్తించి యుండెననుటను సాక్ష్యము గాన రాదు. ఈపద్యమును శ్రీనాథకవి చెప్పియుండినదే వాస్తవమైన యెడల వార్థక్యమునఁ