పుట:Srinadhakavi-Jeevithamu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము


క్కించినట్టి యన్న వే మేస్వేశ్వరుని యంకమాళయించి, విముధర్మశీలుం డగు వీరభద్రభూపాలులకు గన్నులపండువుగా నిండుగొలువుండు వేళ సల్లాక వేమవిభుఁడు శ్రీనాధకవి సార్వభౌమునికప్పించి పలికి నట్లుగా గాశీఖండ మునఁ జెప్పుఁబడిన పద్యమిది. శాస్త్రి గారు తలుచినట్టులు ద్రాక్షారామస్సరోరాయల యదల్లపై బుగబుగలొల్పుట కీచ్చట కస్తూరి కాదు. ఇక్కడవ క్కాణింపఁబడినది ప్రౌఢసాహిత్యము. దీనిన: దాహరింపక నీపద్యము పై తమభావమేమో దెలుపక బడబడ తిట్టి వేయుట సవ్విమర్శకులక్షణము కాదు. అందువిషయమైన చర్చరాబోవు ప్రకరణములలో విస్తరింపఁబడును గావున నిప్పటికిచ్చట విరమించెదను.

పంటమైలార రెడ్డిని సందర్శించుట

శ్రీనాథకవి కొంతకాలము పంట మైలార రెడ్డితో మైత్రిగలిగి యాతనివలన సత్కారములను బొందుచుండెనని చెప్పుదురు. శ్రీనాధుని దిన వెచ్చము నంతయు నాకాలమున నాతఁడు భరించుచుండెనట. ఇతఁడు ప్రౌఢ దేవరాయని విశ్వాసమునకఁ బాత్రు లైన వారిలో నొక్కఁడు, ఇత డతిపరాక్రమవంతుఁడు. తురుష్కులతోడను, గజపతులతోడను, జరిగిన యుద్ధములలో రాయలకు విజయమునుసంఘటింపఁ జేయుచుండెను. ఇతఁడు సూరారెడ్డి మునిమనుమఁడును, పోతిరెడ్డి మనుముడును, ముమ్మడీంద్రు నకు ముమామ్మయందుజనించిన పుత్రుఁడు నయియుండెను: ఇతనికీ థరణీ వరాహుఁడు, చౌహుత మల్లుఁడునను బిరుదములుగలవు. ఇతని వీరఘంట ధ్వనివినంబడినతోడనే శత్రు రాజులగుం డెలదరుచుండునట. ఈమహా పరాక్రమ వంతుఁడైన మైలారవిభుఁడు తసకొనఁగూర్చిన జయములకు సంతోపించినవాఁడై యొకనాఁడు ప్రౌఢ దేవరాయల వారు మైలారువిభునిరప్పించి నీవేమికోరెదవో కోరుమన నుడివెనట. అందులకాతఁడు వినమృడగుచుదేవరా! నాకు నగలు నాణెములక్కర లేదు. ధనమక్కరలేదుగజాస్వాందోలికాది వాహనము లక్కర లేదు. ఎవ్వరి