పుట:Srinadhakavi-Jeevithamu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

శ్రీనాథకవి


గలడి. అయ్యది ప్రభుపుంగవులకుగాని సాధ్యపడునది కాదు. ప్రభువులు దానము చేసెడు కస్తూరిని దేవస్థానమునకు సేవఁ జేయునట్టి దేవదాసీలు కొంతభాగమును గైకొని తమవక్షస్థలములందు రాచుకొనుచుందురు. ఇట్టివగుట చేతనే తెలుఁగు రాయఁకు ద్రాక్షారామభీమేశ్వరసన్నిధాన ముననున్నప్పుడు కని కస్తూరిని వేడుచు చెప్పిన పద్యమము యున్నది. .. ఈ పద్యము శ్రీ నాధుని దేయని చెప్పుటకు వారొక హేతువును జూపిరి. ఇటువంటి పద్యమే 'క్ష' ప్రాసముతో నున్న దొకటి కాశీ ఖండ మున గలదని చెప్పి, వాపద్యము సుదాహరింపక పోయినను నేను దాని నిట సుదాహరించుచున్నాఁడు.


శా. ఈ క్షోణిన్నిమ బోలు సత్కవులు లేరే నేటి కాలంబునన్
చాక్షారామచాళుక్య భీమువగ గంధర్వాప్పలీ భామినీ
వక్షోజప్పయగంధ పారముసృణ ద్వైరాజ్య భావంబున
ధ్యక్షించున్" గవిసార్వభౌమ భవదీయ పౌన సాహిత్యముల్ "


ఈపద్యమే ప్రభాకరశాస్త్రి గారిని పెడమార్గముఁ బట్టించినది. ఈపద్య ముయొక్క. భావమును దెలిసికొనవలెనన్న నాకాలమునాటి దర్బారుల తీరు పెట్టివో, ప్రభుచిత్తవృత్తులెట్టివో, ప్రజలమర్యాద లెట్టివో, యాచా రములలోను, నడవళ్లలోను నేవి దూష్యములో నేవి దూష్యములుగావో కవిసంప్రదాయము లెట్టివో, కనులపోకడ లెట్టివో, దేవదాసీప్రతిష్టాపన మెట్టిదో దీని నెల్ల నవగాహనముఁ జేసికోన్న మీదట సాధ్యపడును గాని స్థూలదృష్టితో జూచువారికి బోధపడదు. కవి హృదయమును గ్రహీం చినఁగాని న్యాఖ్యలపహాస్య భాజనము లగును. ఈపద్యము వీరభదా రెడ్డి త్రైలోక్య విజయాభడం బైన సౌధములోఁ జంద్ర శాలాప్రదేశంబునందు, సచిన సెన్యా ధీశ సామంతనృప వారసీమంతిణీ జనజన శ్రేణిగొలువ, శాస్త్ర మీమాంసయు,సాహిహిత్యగోష్టియు విద్వాంసులు విస్తరింపుచుండ కర్పూరకస్తూరికా సంకుమన గంథ సార సౌరభము దిక్పూరిత మగుచు నుండ, నిజభుజావిక్రముంబున నిఖిలదీశలు గెలిచి తన్ను రాజ్యపీటమె