పుట:Srinadhakavi-Jeevithamu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము


విమర్శాఖడ్గమును తళత్తళలాడునట్లు మెజపించుచుఁ బదునైదశతాబ్దిలో 'విశ్వకీర్తి సూక్తికర్సూరములు దిశాంగణముల కుందు నెగ చల్లినట్టి శ్రీనాథ కవిసార్వభౌముని యశస్సును చించి చెండాడుటకై పఱు విడునట్టి సాహసము భరింపరానిదిగ నున్నది.

శ్రీనాధుడికి వైషయికక వాంఛలత్యున్నతములఁట, భోగపరాయణత మొండఁట. ప్రౌఢ నిర్భకనయ, పరీవాక కాలమగుటచే నాతడప్పుడు శృంగార సముద్రమునఁ దెప్ప దేలు చున్నాడట. దాక్షారామాస్సరో రామల యొడళ్ళపయి బుగబుగలొల్పుట కని తెలుంగురాయని కస్తూరి కోరినాఁడఁట. ఇయ్యవి ప్రభాకర శాస్త్రి గారు తమ నేతి బీర' లోఁ జొప్పిన సభావములు. ఇట్టి భావములు లోకజ్ఞాన మెరుంగని శుద్ధి ఛాందసులు వెల్వరంపవలసిన భౌవములు గాని ప్రభాకరశాస్త్రీగారివంటి కోవిదుడు శృంగార రసాస్వాదన తత్పరుండయిన సరసకవి శిఖామణి నెల్వరింపనలసిన భావములు గావు. ఈపద్యము రచింపఁబడుటకుఁ గల కారణమిద్ధి. పాపము. ప్రభాకరశాస్త్రిగారు పై పద్యములోని సుకనిగాడ్బృందారక స్వామికిన్ " అనఁగా శ్రీనాథునికని యర్ధముఁ జేసికొనిరి.అందువలన శ్రీనాథుని కొంపకుఁ జిచ్చు పెట్టుట సంభవించెను. ఆ సమాసపదమునకు శివుఁడని యర్థము. ఇచ్చట దాక్షారామ భీమేశ్వర స్వామికవి భావము. తెలుఁగురాయఁడు దాక్షా రామ భీమేశ్వర స్వామిని సందర్శింపఁగోరి వచ్చినప్పుడు భీమేశ్వరస్వామివారి సన్నిధానమున శ్రీనాధకవిగానిండు, మఱియొక కవిగానిండు భీమేశ్వరస్వామివారికిఁ గస్తూరిబాసము చేయవలసినదని హెచ్చరించిన పద్యముగాని మఱియొండు గాదు. కవిచమత్కరించి చెప్పినాఁడు. ఆకాలమునఁ బ్రభుపుంగవులుగాని, సామాన్య గృహస్థులుగానీ సుగంధి దవ్యములను స్వామివారికి గాన్కగా నొసంగు నోకయాచారము గలదు. అయ్యది చిరకాలము నుండి జరుగుచుండెను. అట్టి సుగంధి ద్రవ్యములలోఁ గస్తూరిమిగుల విలువ