పుట:Srinadhakavi-Jeevithamu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

శ్రీనాథకవి

నిలిపి సొంప కాయస్థాపనాచార్య బిరుదమును గాంచెనని చెప్పబడియుం డుటచేత మధురవిజయములోఁ జెప్పినది యతిశ యోక్తిగా భావింపవలసి యున్నది. ఈసాంపరాయలే 'తెలుంగాధీశుని తండ్రియని జయప్తి రామ య్యగారును కొమఋజు లక్ముణరావు గారును నభిప్రాయులగుచున్నారు గాని తెలుగురాయల కుటుంబమువేఱు, ఈ రాజనారాయణసాంపరా యని కుటుంబము 'వేఱు. తెలుగు కాయుకు నీసాంప రాయలకు నేను బది సంవత్సరములు వ్యత్యాసము గలదు " ఈ తెలుఁగురాయని తండ్రి మేదినిమీసరగండకణారి సాళువబిరుదాంచితుఁడైన శంభు యఁడుగాని రాజనా రాయణ ఐకు జాంచితుఁడై న యాశంభు రాయఁడు గాఁడు. శ్రీనా థుఁడు తెలుఁగురాయని సందర్శించినప్పు డిట్లాశీర్వదించెనట!

శా. ధాటీఘోటకరత్న ఘట్టక మిళవ్రాఘిక ళ్యాణ ఘం
టాటం కార వీలుంగలుం తమహోన్మత్తా హితక్షోణి భృ
త్కోటిగాంకితకుంబినీధర సముత్కూటాటఝ్టటక
ర్ణాటాంధ్రాధిప సాంపరాయని తెలుంగా నీకు బ్రహ్మాయునౌ<poem>


ఈపద్యము తెలుఁగు రాయుఁ డశ్వారూఢుఁడై యుధోన్ముఖుఁడై దండయాత్ర, వెడలనున్న కాలమునఁజూచి చెప్పిన పద్యమైయున్నది. మఱియు నీతెలుఁగు రాయఁడు కవులకు కస్తూరి యొసఁగు చుండెడివాఁడట. అందుచే శ్రీనాథకవి యొకప్పుడీ క్రింది పద్యమును జెప్పెనని కొందఱు చెప్పవత్తురు,

అక్షయ్యంబగు సాంపరాయని తెలుంగాధీశ ! కస్తూరి కా
బిక్షా దానము చేయు రాసుకవి రాడ్బృందారక స్వామికిన్
దాక్షారామపురీ విహార వనగంధర్వాప్సరో భామినీ
పక్షోజద్వయ కుంభి కుంభముల వై నాసించుఁ దద్వాసనల్

,

ఈపద్యమేభావముతో నేకాలమున నేసందర్భమునఁ జెప్పఁ బడినదోయదార్ధమును గ్రహింపఁజాలక కవి హృదయమును బెలిసి కొన లేక ప్రభాకరశాస్త్రి గారు నల్లేరు పై బండిపఱువికినట్లు తమ