పుట:Srinadhakavi-Jeevithamu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

శ్రీనాథకవి

ట రాజ్యూదీశ్వరుఁడగు ప్రౌఢ దేవరాయనికి వశ్యమైపోయెను. ఇతని మరణ ముతో రాజ్యమాతనికి వశ్యమైపోయెను. ఏదియెట్టిదిగానున్నను. ఇతని పొలనము జనరంజకముగ లేదనియు, అత్యల్ప కాలములోనే యితనిపరిసా లనము తుదముట్టెననియుఁ జెప్పవచ్చును.


తెలుఁగురాయని సందర్శించుట

"పెడ కోమటి వేమభూపాలుడు 1460 దవ సంవత్సర ప్రాంతమున మరణముఁ జెందిన "వెనుక శ్రీనాథుఁడు రాచవేముని పరిపాలము ముగి యువఱకును కొండవీడునగరమున నుండి యాపిమ్మట ప్రౌఢ దేవరాయ నికీ సేనాధిపతులును సామంతులునైన తెలుగురాయనికడఁ గొంతకా లమును, పంట మైలార రెడ్డికడ కొంత కాలమును గడపెను. తెలుఁగురా యఁడు శ్రీమన్మహామండలేశ్వర మేదినిమీసరగండక శారిసాళువ రాయవిభాళమహా రాజు యొక్క కుమారుడైన శ్రీ మహామండలేశ్వర మేదిని మీసరగండకఠారిశాళువంశంబురా దేవ మహారాజు పుత్రుడైన 'తెలుఁగు రాయఁడు గాని మఱియొక తెలుఁగురాయఁడు గాఁడు. ఇతఁడు కొంత కాలము కృష్ణానదీ ముఖ ద్వారమునందున్న శ్రీకాకుళమున నున్నట్లు తెలియవచ్చునున్నది. తెలుఁగురాయని తండ్రియగు శంభు రాయఁడును, సాళ్వమంగు జయింపఁబడిన శంభురాయఁడును. వేట్వేఱుపురుషులని నేనాంధ్రుల చరిత్రములోని మూఁడవభాగమున నిట్లు వ్రాసియున్నాను.

"బుక్కరాయలకు దేవాయియను భార్యవలన మూవురుకుపుత్రు గలిగిరి. వారిలో జేష్ఠుఁ డైన కంపరాయలు తండ్రియాజ్ఞను శిరసా వహించి దక్షిణదిగ్విజయ యాత్రకు బయలు దేఱెను. ఈ దిగ్విజయయాత్రలో వైష్ణవము మతావలంబకుఁడైన గోపన్న మంత్రియును, సాళువమంగరాజును సైన్యాధిపతులుగనుండి తోడ్పడిరి. తండ్రి యజ్ఞానుసారముగా కంపభూపతి తుండీరమండలమును ద్రావిడ దేశమున కధిపతియైన రాజు నారాయణ సాంబువరాయలను (సోంపరాయలను) జయించుటకై