పుట:Srinadhakavi-Jeevithamu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము

151


నివ్రాసినది, సరికాదని యిటీవలఁ దెలిసికొన్న విషయములను బట్టి తెలిసి కొనుచున్నాను.

రాచవేమారెడ్డి. (1987-036)


ఇతని పరిపాలనము జనరంజకమైనదిగా గనుపట్టదు. ఎవరెన్నివిధములఁ దన రాజ్యమాక్రమించుకొనవలయునని ప్రయత్నించినను నితనితండ్రి పెద కోమటి వేముఁడు వారలను బరాజతుగావించి నై పుణ్యము మీఱ జనరంజకముగా ధరా పాలనము గావించెను. కొత్త సుంకములను వేయక పాతపద్ధతులనే బలపజీచి సుంకములు రాబట్టుచుండెను. ఆర్యమతమును పోషించి వేదాధ్యయస సంపన్నులను శాస్త్రవేత్తలను భూదానములు మొదలగు వానిచే సత్కరింపుచు సమస్త విద్యలను బోషించు చుండెను. దేశమున వర్తకవ్యాపొర మాభివృద్ధియగు మార్గములను వెదకుచుండెను. బావులు, చెఱువులు, కాలువలు తవ్వించి వ్యవసా యములకు మహోపకారములను గావించెను. అతని పరిపాలనము సర్వో త్కృష్టమైనదిగ నుండెను. ఇతని తరువాత రాజ్య భారమును వహించిన యీతని కుమారుఁడగు రాచవేమన తనదుష్ప్రవర్తనము చేతఁ దండ్రికి నపయశస్సుకలిగించుటయే గాక తుదకు రాజ్యమును ప్రాణయులనుగూడ గోల్పోయెను. కరాచవేమన తనపూర్వుల మార్గము:మునుగాని తనతండ్రి మార్గమునుగానీ యవలంబింపక తానొక కొత్త నూర్గ మవలంబి .చికొత్తపన్నులను విధించి ప్రజలను బాధింప మొదలకలు పెట్టెనని దండకవిలె తెలుపుచున్నది. రాచ వేమన ప్రజలపై పురిటి పన్ను విధించి యక్రమముగా రాఁబట్టుచుండె ననియు, తనభృత్యుడగు సౌరముఎల్లయ యను నొక బలిజ నాయకునిపై పురుటిపన్ను వేసి బలా త్కారముగావసూలు చేసినందున నాతఁడా గ్రహించి యొకనాడు ముత్యాలమ్మ నాతని కఠారితోఁ బొడిచిచంపెననియు: బైనండకవిలే నుడువుచున్నది.ఇతఁడు బతికియుండఁగనే కొండవీటి రాజ్యములో రెండువంతులు కర్ణా