పుట:Srinadhakavi-Jeevithamu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథకవి

తరువాత శ్రీనామఁడు మైలారరెడ్డి మొదలయిన సామంతసంస్థాన ప్రభువులనుగూడ సందర్శించి యర్హ సంభాపనలు పొంది దేశ సంచారము ముగింపవలసిన వాఁడయ్యెను. ఈసంచారము ముగింపక ముందే శ్రీనాథుఁడు ధాన్యవాటీపురమున కోదారిలో కృష్ణ గోదావరీ ముఖ్యాంతర్వేది సీమకోపోయి యచ్చటి యప్పటి సంస్థానాధిపతియైన డంతులూరి గన్నన్నపాలునికడఁ గొంతకాలముండి యాతనికి ధనంజయ విజయమంకితము చేసినట్టు గనంబడుచున్నది." అని తమకలము యొక్క వాడిపోటును జూసినారు. శ్రీనాథునిపట్ల 'అర్హ సంభావన' శబ్దమును పలుమాఱు వినియోగించినను శ్రీనాథునకుఁ గలుగఁబోవు నవమానము గాన రాదు. కాని, సర్వజ్ఞసింగ భూపతి వంశీయులని చెప్పఁబడెడి శ్రీపీటికాపురాధీశ్వరునిచే నర్ఘ సంభావనలంబును పొంది,యనేక ముద్రణములను బొంది ముప్పది సంవత్సరములకుఁ బిమ్మట ఆంధ్రకవులచరిత్ర'మనువృద్ధకృతి కన్యను వారికి సంకితము చేసిన వీరేశలింగముగారికంటెఁ దనకాశ్రయుఁ డైన దంతలూరి గన్నభూపాలుచే సర్హ సంభావనలనుబొంది ధనంజయమును నూత్న కావ్యకన్యనంకితము చేసిన శ్రీనాథకవి సార్వభౌముఁడుధన్యుడనియే నాయభిప్రాయము. ఈదంతులూరి గన్నభూపాలుఁడు తనమనుమఁడయిన రాచవేమారెడ్డి "కాలమునగూడ ధాన్యపాటీపురాధి పతిగనుండియుండును. శ్రీనాథుఁడు కొంచీపురమునకుఁ బోవుటకుఁబూ ర్వము 1419 లోఁగాని 1420 లోఁగాని లేక కొంచీపురమున హరవిలాసము రచించి తిప్పయ సెట్టికి నంకితముచేసి తిరిగి కొండవీటికి వచ్చిన వెనుక 1423 లో గాని ధనంజయవిజయమును రచియించి గన్న భూపా లునకు నంకితముచేసియుండును. ఈధనంజయ విజయ మిప్పుడెచ్చటను గంటఁ బడకున్నది. శ్రీనాథకవి జీవితము యొక్క ప్రథమ ముద్రణగ్రంథ మునందు ఆ కాలమున ధాన్య పాటీపురము నేలుచుండినది, పెదకోమటి "వేమారెడ్డి మామగారగు గన్నా రెడ్డిగాని దంతులూరి. గన్న భూపతి కాడ