పుట:Srinadhakavi-Jeevithamu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

శ్రీనాథకవి


శ్రీ నా ధ కవి


ప్రథమాశ్వాసాంతమునందలి

క.కొమరగిరి నృప వసంతా
గమకవివర గంధ సాతకస్తూరి కుం
కమకర్పూర హిమాంభ
స్సముచంచిత జహనుగంధి శాలాధ్యక్షా

అన్న పద్యములోని సంబోధనము తిప్పయ పెట్టి కుమారగిరి నిమిత్తము చెప్పించిన కర్పూరమును గంధ సారమును కస్తూరిని విక్రయించుగొప్పసుగంధదవ్యముల వాణిజ్య శాలను బెట్టినవాడని చెప్పుచున్నది. ”అని శ్రీనాథుఁడు తిప్పనిఁబ్రభువ న్నందులకును అతని కాస్థానమండపంబు గలదన్నందులకును నధి క్షేపించుచున్నారు. శ్రీనాథుఁడు తిప్పయను వర్ణించిన వర్ణనములలో నతిశయోక్తులు లేవని నేను చెప్ప జాలను కానివీరియాక్షేషణములు మాత్రమొక లెక్కలోనికిఁ దీసికొని రోడగినవికావు. తిప్పయను ప్రభుఁడనుటలో దోష మేమియు లేదు. శ్రీవీ రేశలింగ ముగారే యొక చోట శ్రీనాథునకు కుమారగిరిభూపాలుని సుగంధ భాండాగారా ధ్యక్షుఁడై కోటీశ్వరుఁడుగానుండిన యవవితిప్పయ సెట్టితోడ మైత్రిక లిగినది!" అని తిప్పయకోటీశ్వరుఁడైన ధనికుఁడని వ్రాసియున్నారు.మఱియును కుమారగిరిభూపాలునివలన నాందోళి కాఛతదాని తురంగాది 'రాజచిహ్నంబులను బడసెనని శ్రీనాథుఁడే చెప్పియున్నాఁడు.అటువంటివానిని శ్రీనాథుఁడు ప్రభువని వక్కాణించుట దోషమయ్యేనా?తిప్పయ మహారాజు కాకపోయినను మహా రాజసంపత్తికలవాడు. మహారాజులకు సయితమాశ్రయుఁడని చెప్పుదగినవాఁడు. వాణిజ్యశాల యున్నంతమాత్రము చేత సతని కాస్థానమండపము లేదని చెప్పఁదగునా! ఇంక నతిశ యోక్తులందురా కవితానాసనగల ప్రతి వారును కొంచెమో గొప్పయో వీనియం దభిమానముగలవారే. తమరే తులు పన్నీయకున్న వానిని రాఁబట్టుకొన లేక దొరతనమువారి న్యాయ స్థానముల కెక్కి తగవు పరిష్కరింపుమని కోరెడీ జమీందారులను సయి అతనికి గొప్ప