పుట:Srinadhakavi-Jeevithamu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము

పంచమాధ్యాయము యుండవు. ఎట్లయినను హరవిలాసము 1461వ సంవత్సరమున రచింపబడనేమి తరువాత రచింపఁబడిన నేమి, కుమారగిరి రెడ్డి, పెద కోమటి వేమారెడ్డి మొదలగువారు, మరణమునొందిన వెనుక రచింపఁబడిన దనియే సాదృఢమైన యభిప్రాయము. హరవిలాసములోని గద్య మిట్లున్నది

"ఇది శ్రీమత్కమలనా భవిత్రమారయామాత్యపుత్రూసుకవిజనవీ ధేయ శ్రీనాథనామ ధేయ ప్రణీతంబైన హరవిలాసంబను మహాప్రబంధము నందు.”


అని యుండుటచేతను, శృంగారనై షధమున 'ఇవి శ్రీమత్కమల నాభ పౌత్ర సకలవిద్యాసనాధ శ్రీనాథ ప్రతంబై న' అని యుండుట చేతను,

భీమేశ్వరపురాణమున ఇది శ్రీమత్కమలనాభ పౌత్రమారయూమాత్యపుత్త సుక విజనవిధేయ సకలవిద్యా సనాథ శ్రీనాధ నామ ధేయప్రణీతంబైన యుండుట చేతను సకలవిద్యాసనాభ' అను విశేషణము హరవిలాసములోఁ గూడ జేర్పవలసి యున్నట్లు గనంబడుచున్నది. అది లేఖకులఁ దోషముగాని మఱియొకటిగా భాషింష రాదు. హరవిలాసరచనాకాలము నేను చెప్పినదే క్రమమైనదని నాయభిప్రాయము, దానికీ గల సాధక బాధకములను జాలవఱకుఁ జర్చించినాఁడను,


శ్రీవీరేశ లింగముగారు కవి ధనలాభముకొఱకు కృతిపతిని తిప్పప్రభుఁడనియు, ఆస్థానమంట సంబున సుఖో పవిష్టుండై అనియు, అతిశ యోక్తులతో సెంత యెక్కువగా వర్ణించినను తిప్పయ సెట్టి సముద్రవ్యా పారమును జేయుచు, కుమారగిరికి వలెనే యితర రాజులకును కస్తూరీకుంకు మాది సుగంధ ద్రవ్యములను చీనాంబరాదులను హయరత్నాదులను ఏ దేశములనుండి తెప్పించి విక్రయించుచు పెద్దయంగడి పెట్టిన లజధికారియైన పెద్దకోమటియె గానీ మహారాజు గాఁడు.