పుట:Srinadhakavi-Jeevithamu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము



చుచును.........కుప్పించుచుచును.--- ప్రఖ్యాతి గాంచుచున్న అను వర్తమానార్ధక క్రియలను బయోగించి యున్న యెడల కుమారగిరి రెడ్డి కాలమున హారవిలాసము రచింపబడియుండెనని చెప్పవచ్చును గాన భూతకాలమును దెలువు క్రియలను ప్రయోగించుటవలన హరవిలాసము కుమారగిరి రెడ్డి మరణాంతరము రచింపఁబడియుం డెననుటను మనము విశ్వసింపవచ్చును,


చ. హరిహర రాయ ఫేరొజసహాసుర ధాణగజాదిపాది భూ
వరులు నిజప్రభావ మభివర్ణన సేయఁ గుమారవర్య దీ
శ్వరుని వసంత వైభవము సర్వము నొక్కడ నిర్వహించు మా
తిరుమల నాధ సెట్టికిని ధీగుణ భట్టికీ నెవ్వడీగున్


అని పద్యములోని నిర్వహించు' అను క్రియ భూతార్థక క్రియకుబదులుగా ప్రయోగించినదనియే యగ్గము చేసికోవలయును. అట్లర్దముచేసికొనక పోయినయెడల


<poem>ఉ.ఆతభక్తి సంపద సహర్నిశము ఘృతఖండ శర్కగా
పాతముతో నపూపములు పాయసమున్ గదళీ ఫలంబులుమ్
స్ఫీతము గాగ నన్నములు పెట్టును శంకరభక్తకోటికా
సేతు హిమాచల బవచి సెట్టికి నెవ్వరు డు సాటియిమ్మహిన్.


'అను పద్యములో పెట్టుట్టును' అను క్రియా భూతార్ధమును దెలుపకున్న యెడల తిప్పయ సెట్టితండ్రియగు దేవయ సెట్టికూడ పోలయ వేమా రెడ్డి మరణాంతరము 10 సంవత్సరములవఱకు బ్రదికియుండి కుమారగిరి రెడ్డి కాలమునఁ గూడ శివభక్తులయిన వీరమహేశ్వరుల కెల్లరకు నన్న ములు పెట్టుచున్నా డని యర్ధము చేయవలసివచ్చును. అట్టి దసంభవము గదా: కాఁబట్టి పెట్టున నిర్వహించు, వను క్రియలకు నేను జెప్పిన యర్థమును, భావమును సరిపడకున్నచో • పెట్టెను, నిర్వహించె'నని సవ రించుటయే సమంజసముగా నుండును. హరవిలాసమునందు నోక్కనైష ధమున మాత్రము పేర్కొని భీమేశ్వరపురాణమునుగాని కాశీఖండము నుగాని పేర్కొనకపోవుటచేత నైషథమునకు భీమేశ్వర పురాణమునకును