పుట:Srinadhakavi-Jeevithamu.pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
8
శ్రీనాథకవి

ఆక్షేపింపజొచ్చిరి. ఈ యాక్షేపణలను మనస్సునందుంచుకొనియె శ్రీనా థుఁడు రాజమహేంద్రపుర పండితులమీఁది కోపము చేత కుకవిదూషణ మను నెపముచేత భీమఖండములో నీక్రింద పద్యములను వేసెను.

" ఈకడపటి పద్యములోనివి తన్నితరులాక్షేపించినపుడు సమాధా నముగాఁ జెప్పఁబడిన పరిహాసగర్భితములైన మాటలే కాని తనకవిత్వ ము కర్ణాటభాషయని శ్రీనాథుని యభిప్రాయ మెంతమాత్రమునుగాదు. ఇట్లన్యాప దేశముగా దూషించుటయేగాక రాజమహేంద్ర పండితులను శ్రీనాథుఁడు బహుపద్యములం దాక్షేపించి యున్నాడు”[1]

ఇట్టి జ్ఞానము శ్రీవీ రేశలింగముగా రాంధ్రుల చరిత్రములోని మూఁడవ భాగములో శ్రీనాధుని చరిత్రమునుగూర్చిన నా చర్చను జదివిన పిమ్మట వారికిఁ గలిగినదిగాని యంతకుఁ బూర్వ మిట్టి యభిప్రాయము గలిగియుండ లేదనుటకు వారి నూతన గ్రంథమునుండియే యిందుకు భిన్న ముగా వ్రాసిన దని నుదహరించుచున్నాఁడను. వేములవాడ భీమకవి జీవితములో

“ఆకాలమునందలి తెలుఁగుపండితుల కందఱికిని సంస్కృత కర్ణాటక భాషలు సాధారణముగా వచ్చుచుండెను. అందు చేత దెలుఁ గును సహితము గర్ణాటకమనుచుండుట యప్పుడప్పుడు గలదు. శ్రీనా

థుఁడు తన భీమఖండములో నేమనెనో చూడుఁడు:

  1. శ్రీ వీరేశలింగము గారు తమ కవుల చరిత్త్రమునుండియే యాంధ్ర చరిత్రకారుఁ డీసిద్ధాంత మునంతయు గృహించెనని భావికాలపుజనులు తలంపవలయునను సుద్దేశముతోఁ గాఁబోలు దను తొంటి యభిప్రాయమునుమార్చుకొని యూంధ్ర చరిత్ర కా రుని యభిప్రాయమును సరియైనది గ్రహించితిమని నెచ్చటసు జప్పకయే 'మెల్ల గా నిట్టిభావములను జడీచప్పుడు లేకుండఁ బ్రవేశ పెట్టిన. తద్భిన్న ముగు నభిప్రాయము నింకను గ్రంథము నందే యుంచి యేల పరిహాస పాత్రులు గావలయును?