పుట:Srinadhakavi-Jeevithamu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము


హరివిలాసపీఠికను జక్కగా బరిశీలించిన పక్షమున నాగ్రంథము కుమారగిరి రెడ్డి బ్రదికీ యుండఁగా రచింపఁబడియుండ లేదని తేటపడ గలదు.


శ్రీనాథుఁడు హరవిలాసావ తారికలో "అని ప్రార్ధించి . . . . . ......................... కొండవీడు పురంబు రాజధానిగా గీర్తిల తాధిష్టి తాష్టాదశ ద్వీ. పొంతరాళుండునగు కొమరగిరి వసంతనృ పొలువలన నాందోళికా ఛత్ర చామర తురంగాది రాజచిహ్నముల వడసి యమ్మహా రాజునకుం బ్రతి సంవత్సరోత్సవఁ బునకుం దగిన కస్తూరి కుకుకు ఘనసార సంకుమద హీమాంబ కాలాగురుగఁ ధసారప్రభ్రుతి సుగంధ ద్రవ్యంబు లొనగూర్చియుఁ జీవిసింహళతవాయి హుగుమంజూ జలనోగి ప్రభుతి నానాద్వీప నగ రాకరంబులగు ధనకనక వస్తువాహన మాణిక్యంబులు తెప్పించియుఁ గవి నైగమిక వాది వాంశిక వై తాళి కాదులగు సర్ధిజనంబులకును నర్థం గుప్పించియు ధీరుడును నుదారుండును గంభీరుండును సదాచారుండు నన విఖ్యాతిగాంచిన యవచిదేవయతిప్పయప్రభుం డొక్కనా డాస్థాన మంటపంబున సుఖో పవిష్టుండై" అనీ వాసియున్నాఁడు. పైవచన మునందు కింద నడ్డుగీట్లు గీయఁబడిన పదముల ప్రయోగముల వైఖరులనుజూడఁగా భూత కాలమున జరిగిన విషయములనే సూచించి యున్నాఁడనియు,తిప్పయకంకితము గావించినది కొండవీటి పురములోఁ గాదనియు, అప్పటికి గుమారగిరి రెడ్డి మరణము నొందిన వాడనియు, బోధపడకమానదు. కుమారగిరి రెడ్డి దిప్పయకుటుంభమువారు పొందిన యున్న తస్థానస్థితినిగవి వర్ణించి యశస్సును గలిగించుచున్నాడు. గాని వవర్తమానకాల స్థితిని దెలిపిన వాడు కాడు. "(ప్రతిసంవత్సరోత్సవమునకు) --ఒడ..... గూర్చియు.--- చెప్పించియు.......... కుప్పించియు - విఖ్యాతిగాంచిన" అను భూతార్ధక క్రియలకు మాఅఱుగా, ఒడఁగూర్చుచును.......దెప్పిం