పుట:Srinadhakavi-Jeevithamu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ నాథ కవి

శ్రీనాథకవి


"పెదకోమటి వేముని కీర్తిలత శ్రీశైలమున స్థిరమూలమై కుమా రాచలమున వృద్ధినొంది పంచారామములునుము, సింహాచలమునకు బందిరి యల్లి, శ్రీకూర్మమునను, పురుషోత్తమమునను బుష్పించి కాశిలో విశ్వనాథు నెదుర నిత్య నైవేద్యమున కుచితముగా ఫలించే " నని వయిశ్లోకమున కర్ణము. వేమభూపా చరితమున నాకఁడు దిగ్విజయార్థముగా నాసేతుహిమాచలము యాత్ర సలిపినట్టా గ్రంథమునం దదియే ముఖ్యవిషయముగా వామన భట్టబాణుఁడుభివర్ణించి యున్నాఁడు. శ్రీనా ధుఁడుగూడ గాశీయాత్రలో వేమభూసాలుని వెంబడించియుండును. ఈ క్రిందిశ్లోకముగూడ వేమభూపాలుఁడీ యాత్రలను చేసినట్టు బలపడు చుచున్నది.

శ్లో. 'కావేర్యాం తిపురాంతకే జయపురే కాశీపురేగోకులే
పంచారామ పురీషు పట్టసపురే మార్కండ శంభో శపు రె,
గంగా సాగర సంగమేఘ నిరతం శ్రీకొండవీటీపురే
చాళుక్యామయు తొన్న దాన నిరతయు శ్రీ వేమభూపపభు.

రామేశ్వరయాత్ర ముగించిన వెనుకఁ గాశీ యాత్రకుఁ బోయుండును.

సంతానసాగరనిర్మాణము.

ధాన్యవాటిపురమను నామంతరముగల ధరణికోటకుఁ బ్రభువగు గన్న భూపాలుని కూతురైన సూరాంబను పెదకోమటి వేమభూపాలుడు వివాహముఁ జేసికొనియెను. ఆమె సంతానసాగరమను నొక పెద్ద చెఱువును ద్రవ్వించి శా. శ.1331 విరోధి సంవత్సర ఫాల్గుణ బ 2 , శుక్రవారమునఁ బతిష్ఠ యొనర్చెసని ఫిరంగిపుర శాసనమువలనఁ దెలి యుచున్నది. ఈశాసనము చివరను,

విద్యాధికారి శ్రీ నాథా వీరశ్రీ వేమభూపతే
అకరో దాకరో వాచాం నిర్మలం ధర్మశాసనం."

అని యుండుట చేత నియ్యది శ్రీనాథ విరచితమని స్పష్టపడు చున్నది. ఈశాసనముతుదను శ్రీనాథ విరచితములై న యీక్రింది' సీస