పుట:Srinadhakavi-Jeevithamu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాధ్యాయము

123

03

ర్ఘాస్థి మ్యూక వస్త్రభ ముపు ఏ ముసకు కర్మయుల సమాస్యం
దృష్ట్పావల్మీక పార్శ్వేభుంగవరము పేతెయాభయో యంకృపాళు యు సేద్యాభయో
కృత్వాసమ్యక్తికి మచిక " ముపరు జాతేవ దత్తాభియశ్రీ
న్యాత్దోన్ పాక్రమతాత్పరహితభిషజోనామతస్వార్థన్ యుక్తం

పరహితాచార్యుఁడకు వైద్యునకు మూలపురుషుఁడగు పరహితుఁడను నాతఁడొకానొకప్పుడొక సర్పము దౌడలు రెంటికిని నెముక గుచ్చు కొని బాధపడుచుండుటఁ జూచి యయెముక నూడఁబెఱికి పుండునకుఁ జికిత్సయెచర్చి, పరహితుఁడను ననర్థ నాముఁడై యాపామువలన నభయ దానమును బొంది చికిత్స చేయనారంభింప నాటినుండియు సర్పచికిత్స యాకవివంశమున బరంపరగ నడచివచ్చుచుండెనఁట. భాస్కరార్యుఁడు భూలోక ధన్వంతరియని శ్రీనాధుఁడు లిఖించినాడుగాని ప్రసిద్ధ సర్పచికి త్సకునిగాఁ జెప్పీయుండ లేదు. తండ్రిని దక్క భాస్కరార్యుని పూర్వుల మఱియెవ్వరిని గూడ పొన్ను పల్లి శాసనము పేర్కొనియుండ లేదు. కలున చేఱు శాసనమునఁ బరహితుని పూర్వు లెల్లరును గొప్ప సర్పచికిత్సకులని పేర్కొనంబరి. పొన్ను పల్లి శాసనము 1404 వ సంవత్సరమునను , కలువ చేఱు శాసనము 1423 వ సంవత్సరమునను లిఖయింపఁబడినవి. ఇంచుమించుగా గెంటికీ నడుమ 19 సంవత్సరము లుండును. ఇంత మాత్రము కాలవ్యవధిగల శాసనములలో నొకేవంశము యొక్క గోత్ర ములు భిన్నములు గానుండుటకు హేతువేమయి యుండునో దుకూహ్యము. వేమభూపాలుడు కృష్ణ వేణి నదికి దక్షిణ తీరముననుండు పొన్ను పల్లియను గ్రామమునకు వేమవరమనుసొమమును 'బెట్టి సోమేశ్వరస్వామి, సన్నిధానమునఁ బుత్త పొత్త పారంపర్యముగా ననుభమిష ననేక బా హ్మణులయెదుట భాస్కరార్యునకు దానము చేసి యుండెను.

(2) సింగనార్యుడు; — కళ్యాణగుణ శాలియగు పెరియ పిళ్ళకు సప్తసాంగ వేద వేదియు బ్రహ్మ వాదియు నగు భట్ట భాస్కరార్యుని పాత్రుడు పదు నెనిమిది విద్యల ముందు పారంగతుడైన విళ్ళ యార్యునకు