పుట:Srinadhakavi-Jeevithamu.pdf/120

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాధ్యాయము

113


మును బొందిన వెంటనే స్వార్థమునకై శ్రీ శైలయాత్ర చేసి యొక జంగమ గురు దేవసకుఁ గృతినిచ్చెననుట హాస్యాస్పదముగఁ గస్పట్టుచుండ లేదా? ఆట్లు కనకాభిషేకముగాంచిన కవిసార్వభౌముఁడు (శ్రీవీ రేశలింగముగా రెగతాళిగాఁ బలికినట్లు) అర్హ సంభావనకై జంగమగురు దేవరకుఁ గృతి నొసంగియుండఁడు. కావున 'బెదకోమటి వేమభూపాలుని యాస్థానంబున సకల విద్యాసనాథుఁడైన శ్రీనాధుఁడు. విద్యాధి కారపదవి నధిష్టించి యున్న కాలమున శ్రీలక్ష్మణ రావు గారు నుడివినట్లు పల్నాటివీరచరిత) మునుగాని' శ్రీ వీరేశలింగముగారు నుడివినట్లు శివరాతి మహాత్మ్యము గాని రచించియుండ లేదని ఋజువుచేసి యున్నాడను. శ్రీ వీరేశలింగము గారు పలికినట్లు వింశతిదీర్ఘ సంవత్సరములు నిరర్గళకవితాధారగల కవి చేతి లేఖనియు సనల్పకల్పన సమర్థమైన బుద్ధియు స్వసామర్థ్యమును మఱచి యస్వాభావిక నిద్రను వహించుట సంభాన్యము ' కాదనుట యొప్పుకో దగియున్నది. శ్రీనాథుఁడు కొన్ని గ్రంథములను రచించియుండక పోఁడు. పొనిలో ముఖ్యమైనది శృంగారనైషధమనుటకు సంశయింపఁ బనిలేదు. ఎందుకన, " శ్రీ రాజ రాజ వేమక్ష్మారమణ కృపాకటాక్షు సంవర్ధితలక్ష్మీ రక్షి తబుధ లో క " అని సింగనానూత్యుని శ్రీనాథుఁడు సంబోధించి యుండు టచేత 1400 సంవత్సరమునఁ గొండవీటి రాజ్యమునకు బెదకోమటి వేము భూపాలుఁడు పట్టాభిషిక్తుడైన తరువాతనే వానిమంత్రిగా నున్న మామి డిసింగనామాత్యునకు వానికోరిక మీద శృంగార నై షధమును భాషాంత రీకరించి యంకితము చేసియుండెనని దృఢముగాఁ జెప్పవచ్చును. మామిడి సింగనామాత్యుఁడు రాజ కార్యధురంధరుఁడు మాత్రమేగాక విద్వాం సుఁడును, గణితశాస్త్రజ్ఞుడును దైవజ్ఞ శిఖామణియుఁ గూడనై యున్న వాడు. ఈసింగనామాత్యుఁడు 1415 దవ సంవత్సరమునఁ దాను బెదకోమటి వేమభూపాలునకు మంత్రిగానుండియు సోమసిద్ధాంతముసకు వ్యాఖ్యానమును జేసియున్నాడు. శ్రీనాథుఁడు....సింగనామాత్యు :