పుట:Srinadhakavi-Jeevithamu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

శ్రీనాథకవి

శ్రీ మభట్టును) శ్రీనాథుఁ డోడించుట 1423 వ సంవత్సరమునకుఁ దరువా తనయి యుండవలెను. 1426 వ సంవత్సర ప్రాంతమున నని తోచు చున్నది. " అని వారే వ్రాయుచు శివరాత్రిమహాత్మ్యము రచించి శాంతయ్య గురుదేవర కంకిత మొనర్చునాటికే శ్రీనాథుఁడు కవిసార్వభౌమ బిరుదాంచితుఁ డై యుండెనని కనపడు నవతారికలోని గద్యపద్య ముల నెత్తి ప్రచురించుచు స్వవచన వ్యాఖాతములతోఁ గూడిన వితండ నాదమును గ్రంథస్థము గావించుట యపహాస్య భాజనమగుటకు, దక్క మఱి యెందునకుం గొఱుగాకయున్నది. శ్రీవీ రేశలింగముగారు శ్రీనాథు నకు (1426వ సంవత్సరమున) రాయలసందర్శనలాభము కలుగుట యేగాక తదాస్థానమునందు విపక్ష విద్యాం సవిజయలాభమును , తగ్బిరు దాంక సంపొదన లాభమును, కనకాభిషేకలాభమునుగూడఁ గలిగి • శ్రీవాణి ప్రసాదలబ్ద సకలవిద్యాసనాథుఁడగు శ్రీనాథు డే విజయము నొంది యూగౌడడిండిమభట్టు కంచుఢక్కను బగుల గొట్టించి యాతని కవిసార్వభౌమ బిరుదమును లాగుకొన సమర్ధుఁడయ్యె" నని వ్రాసియుండుటచేత వారివాక్యములే వారి వాదమును సమూలచ్ఛేదము గావించుచున్నవి. శ్రీవీ రేశలింగముగారు "ఇట్లు శ్రీశైలయాత్రవలన తీర్థమును స్వార్థమును గలిసివచ్చి యభిమతార్ధ సిద్ధియయిన తరువాత శ్రీనాథుఁ డక్కడనుండి వెలుపడి ధనాగమసమ్మాన సముపౌర్జనార్ధమయి స్థలాంత రాన్వేషణము చేసికొనవలసినవాఁడయ్నెను.... ఈ హేతు వుల చేత శ్రీనాథుఁ డాకాలమువండు మహాబలిష్ఠమై యుండిన కర్ణాట రాజధానికిఁ బోవల సినవాఁడయ్యె నని విస్పష్టముగ వాసి యొప్పుకొని యుండుట చేత మఱియొక వాధమునకు గడంగ వీలులేదు. అప్పు డింతకున్నను, నపహాస్య,భాజనముగఁ బరిణమించును. ఏమున, కర్ణాటాధీ శ్వరునీ సభకుఁబోయి గౌడడిండిమభట్టును నోడించి వానికవిసార్వభౌమ భీరుడమును :గొని యమ్మహా రాజు ముత్యాల శాలలోఁ గనకాభిషేక