పుట:Srinadhakavi-Jeevithamu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాధ్యాయము

111


జీవిత కాలములోనే రచియించుచుండిన గ్రంథమునే యవశిష్టమును ముగించి యవతారికను వ్రాసి యాశ్వాసాద్యంత పద్యములను జేసి శ్రీశై లయాత్రాసమయమునం దర్హసంభాననమును బడసి శ్రీనాథుఁడే శివరా త్రిమాహాత్మ్య మహా కావ్యమును మహాధన సంపన్నుఁడైన ముమ్మడి శాంతయ్య కంకిత మొనర్చినట్లు తోఁచుచున్నది. ఈ గ్రంథము 1424 వ సంవత్సర ప్రాంతమునందు సంపూర్తి చేయఁబడి యుండును...

అని శ్రీవీ రేశ లింగముగారు తమకుంగల యనల్పకల్పన సామర్ధ్య విశేషమునంతయు నచ్చుపడం జేసి యున్నారుగదా? వీరివాఖ్యములలోని యుక్తిరత్నములవంటి యుక్తిరత్నముల .. మన మెన్నఁడును జూడఁ బోము. పెదకోమటి వేమభూపొలుని యాస్థానంబున విద్యాధికారపదవి యందుండిన యిరువది సంవత్సరముల కాలములో శ్రీనాథ మహాకవినం టివాడు శివరాత్రి మహాత్మ్యమను కావ్యమును రచించినాఁడఁట! ఈకృ తిరత్నము నంకితము నొందకుఁడ వాని.......... యులుగనుండిన ప్రభువ తంసము 'లెల్లరును స్వర్గస్థులైరట! స్వార్ధమును తీర్థమును గలిసి వచ్చు సని 1460 లో శ్రీశైయాత్రకు బయలు దేఱైనఁట! అచట నవతారి కను, ఆశ్వాసాద్యంత పద్యములను జేసి గ్రంథము సంపూర్తిచేయుట 1424వ సంవత్సర ప్రాంతమునందుగాని సంభవింప లేదఁట! అటుపిమ్మ టనే శ్రీనాథుఁడు ప్రౌఢ దేవరాయని కర్ణాటరాజధానికిఁ బోయి డిండిమభట్టును నోడించి కవిసార్వభౌమ బిరుదము లాగుకొనియుండె నఁట! కాని యాగ్రంథావ తారికలోనే మహా ప్రసాదంబని సత్కవిసా ర్వభౌముఁడగు శ్రీనాథకవివ రేణ్యుని కృపావి శేషంబున, నీశివరాత్రిమ హాత్మ్యము చెప్పంబడి యుండెనని వ్రాయఁబడియున్నదట! వీడే గవిసార్వభౌము విమలచరితు' ననిగూడ యున్నడంట! పల్నాటి వీరచరి త్రమునకును బట్టిన కవిసార్వభౌమ బిరుదము బాధ శివరాత్రి మహా త్మ్యమునకుఁ బట్టినదన్నమాట ఏ రెఱుంగకపోయిరి. “ఈతనిని (డిం