పుట:Srinadhakavi-Jeevithamu.pdf/117

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
110
శ్రీనాథ కవి


ఇక వీరేశలింగముగారు శివరాత్రి మాహాత్మ్యమని చెప్పిన దానిగూర్చి విచారింతము. వారేమి వ్రాసియున్నారో చిత్తగింపుఁడు. 1400 వ సంవత్సరము మొదలుకొని గర 1420 వ సంవత్సరము వరకును మహాకవి యైన శ్రీనాథుఁ డొక్క గ్రంథమునై నఁ జేయక యూరకుండఁ జాలఁడు. ఇట్లు వృధపుచ్చఁ బడినదనుకొన్న కాల మిరునది సంవత్సరములే యన నేల. ఇరువదినాలుగు సంవత్సరములు కావచ్చును. . . . . . ఎట్లయి నను వింశతి దీర్ఘ సంవత్సరములు నిరర్గళ కవితాధారగల కవిచేతి లేఖుని యు సనల్పకల్పన సమర్థమైన బుద్ధియు స్వసామర్థ్యమును మఱచి య స్వాభావిక నిద్రను వహించుట సంభాన్యముకాదు. అందు చేత శ్రీనాథుఁడీ కాలములో నేదో మహాగ్రంథమును రచించుచుండి యుండవలెను. అమహాగ్రంథము శివరాత్రి మాహాత్మ్యమని తోచుచున్నది. శ్రీనాథుఁడు దీనిని తన ప్రభువైన పెదకోమటి విభుని కంకితము చేయవ లెననియే యుద్దేశించి యుండును. కాని యింతలోపల కొండవీటి రాజ్య మన్యా క్రాంతమగుటయుఁ దనకాశ్రయులైన వేమనృపాల సీంగనామాత్యాదు లు పరలోకగతులగుటయుఁ దటస్థించి నందున శ్రీనాథ మహాకవి రాజ ధానియైన కొండవీటియందు నిలువ నాధారము లేక తనగ్రంథపరికరము లతో నావీడు విడిచి దేశాంతరగనునోన్ముఖుఁడై 1420 వ సంవత్సర ప్రాతములయందు ముందుగా స్వార్థమును తీర్థమును గలిసి వచ్చునట్లు గా శ్రీశైలయాత్రకు "వెడ లెను. అట్టి పుణ్యస్థలమైన శ్రీశైల దివ్య క్షేత్రమునకు కొండవీటి రెడ్డి రాజ్య నాశనా నంతరమున శ్రీనాథుఁడుయాత్రకుఁబోవ 'దేవతాదర్శనము చేయుటయేగాక యచ్చట మఠాధికారులయి లక్షాధికారులయి యుండిన గురుపీఠమువారిదర్శనము చేసి వారి యనుగ్రహమునకు బాత్రుఁడై తాను రచించిన శివరాత్రి మాహాత్మ్యమును ముమ్మయపుత్రుఁడైన శాంతయ్య కంకిత మొనర్చెను. . . . . ఆవఱకుఁ దాను గోమటి వేమనృపాలుని