పుట:Srinadhakavi-Jeevithamu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాధ్యాయము


కొనక వ్యాఖ్యానము చేసి చెప్పిరి. ఇప్పుడన్ననో శ్రీలక్మణరావుగారి నీడ కేచేరి వారితో పాటుగా నతిశయోక్తు ' లను నొక్క పాట పాడుదురు. కాఁబోలు! పోలుంగద! పెడకోమటి వేమభూపాలుడు కొండవీటి సామ్రాజ్య పట్టభద్రుఁడు కాక పూర్వమే నైషధము, హరవిలాసము రచించి యుండిన యెడల 1400 మొదలుకొని 1420 వఱకు శ్రీనాథుడు గ్రంథరచనము లేక చేతులు నలుపుకొనుచుఁగూరుచుండెనా యనియెవ్వ రైన ప్రశ్నింతురను భయము చేత కాఁబోలు నాకాలమున శ్రీనాథుఁడు పల్నాటి వీరచరితమును రచించుచుండెనని శ్రీలక్మణ రావుగారును శివ రాత్రినూహాత్మ్యమును రచించుచుండెనని శ్రీ వీరేశలింగము: గారును వ్రాసియున్నారు. పల్నాటి వీరచరితము బాల్యమున రచించెనని శ్రీ వీరేశలింగమ గారు వచించిన దానికి నేను యాక్షేపణములు చెప్పఁబడి నవో యాయాక్షేపణములు నిండుజవ్వనమున రచిఁంచెనను లక్మణ రావుగారి సిద్ధాంతమునకును వర్తింపుచున్నవి. నైషధము హరవిలా సమువంటి యుత్కృష్ఠ గ్రంథములను రచించి సకలవిద్యాసనాథుఁడను బిరుదమును వహించి పెదకోమటి వేముభూపాలుని యాస్థానంబున విద్యాధి కారిపదవి సధిష్ఠించియున్న శ్రీనాథ కవివర్యుండు శబ్దసౌష్ఠవ జ్ఞానము విడిచి పల్నాటి వీరచరిత్రము వంటి ప్రబంధము నల్లి యుండునని చెప్ప సొహసించినందులకు లక్ష్మణ రావుగారి ధైర్య ము నెంతయినం గొండాడఁ దగియున్నది. సకలవిద్యాసనాథుఁ డైనను శ్రీనాథున కప్పటికిఁ గవిసార్వభౌమ బిరుదము - లభింప లేదు. పల్నాటి వీర చరిత్రములో శ్రీనాథుఁడు కవిసార్వభౌమ బిరుదము గలవాఁడనని చెప్పుకొని యున్నాడు. శ్రీలక్ష్మణరావుగారు పల్నా టివీరచరిత్రమును బఠించియుండ లేదు కాఁబోలు! పల్నాటివీరచరిత్రమా కాలమున రచి పఁబడ లేదని "కవిసార్వభౌముడ ఘనతగన్నట్టి శ్రీనాథుఁడనువాడ శివ భక్తి పరుఁడ నని యతఁడు చెప్పుకొన్న వాక్యములే బాధించుచున్నవి: