పుట:Srinadhakavi-Jeevithamu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

శ్రీ నా థ కవి


వేమవఃంత్రిని దండనాయకచూడావతంసమని వర్ణించిన పిమ్మట పెగడ నామాత్యుని



మ, తగు గై వారి మొనర్ప విక్రమకళాధారేయతాశాలిశ్రీ
ప్రెగడన్న ధ్వజినీశుడంబునిధి గంభీరుడు శుంభద్ద్విస
న్నగం ద్వారకవాట పొటున విధాన ప్రౌడబాహార్గళా
యుగ ళుండా హవసవ్య సాచీ ధరలో నొక్కండు పేరుక్కునన్

.


అని పరాక్రమవంతుఁడు, గంభీరుఁడు, శత్రుపుర భేదకుఁడు, యుద్ధదశుఁడు బలము విషయములో పొగడనర్హుడైన వాఁడు దండనాధుఁడితఁ డొక్క డేయని 'చెప్పియున్నాఁడు. వామనభట్టు 'పెదకోమటి 'వేమభూసాలుని చక్రవర్తియని వర్ణించిన వర్ణన మతిశయోక్తిగాఁ ద్రోసిపుచ్చినను వేమ భూపాలుఁడు కొండవీటి రాజ్యమున కభిషిక్తుఁడై స్వతంతడై పరి పాలనము చేయుచుండ సామ్రూజ్య సంభరణ ప్రౌడ్డై సింగనామాత్యుడు సకలవిద్యా సనాథుఁడైన శ్రీనాథుని సంప్రార్థించి నైషధ కావ్య రచనకుం భోత్సహించినది. యతిశయోక్తి కాజాలదు. శ్రీ వీ రేశలింగముగారు సెదకోమటి వేమన నృపాలుని మండ లేశ్వరుఁడని చెప్పుటచేత నైషధ గ్రంథరచన 'కాలము నాటి కతఁడు రెడ్డి సామ్రాజ్య పట్టభద్రుఁడు కాలే దనియు రెడ్డి రాజ్యములోని మండ లేశ్వరుఁడుగా నుండెననియు దెల్ల దుగుచున్న దని వ్రాసియున్నారు కాని పైన నే సుదాహరించిన శ్రీ రాజు రాజ వేమమ్మోరమణ' యను ద్వితీయాశ్వాసములోని పద్యమును జూచి యుండ లేదు. శ్రీనాథుఁడు శృంగార నైషధము రచించునాటికి వేమా రెడ్డి సామ్రాజ్య పట్టభద్రుడై యుండెననుట (రాజ రాజశబ్దమే వేనోళ్ళ జాటు చున్నది గదా! శ్రీ లక్మణ రావుగారు వీనిం దప్పించుకొనుటకు వేఱు మార్గము గొన రానందున నతిశ యోక్తులని యొక్క తోపు త్రోసి తమ సిద్ధాంతమును నిలుపఁజూచిరి. వీరి వాద దౌర్బల్యమును గమనించి శ్రీ వీరేశలింగముగారు. తమవాదమును గారణయుక్తమైనదానిగఁ జేసి నిలుపఁ బూని ముండ లేశ్వరుఁ డను దానికి వెనుకను ముందును. జూచు