పుట:Srinadhakavi-Jeevithamu.pdf/108

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
101
చతుర్థాధ్యాయము


క్రోడాఘాటక రోటికోటన కుట్లీకోటిలు దత్సింధువీ
చీడో లాపటలీ పరిస్ఫుట తర స్ఫీతధ్వని ప్రాధిమన్
 .
అని యుదాహరించుటయేగాక ప్రభాకరశాస్త్రిగారు

వాణీనఖముఖముఖరిత వీణామాధుర్యడుర్య వాగ్వృత్తి
స్వశ్యధ్వ ధ్వన్య పెదకోమటి వేరు భూపతిర్జయతి : 1,

అను శ్లోకమును, హరవిలాసమునందలి:

క. వాణిజ్యచణునకంత
ర్వాణిమస్తూయమారగ్విభవునకున్
వాణీనాథముఖమఖరిత
వీణావి క్వాణనిభ కవిత్వఫణికిన్

అను పద్యముతోఁ బోల్చి చదువుకొనుఁ డని వ్రాయుచున్నారు. ఇదంతయు సత్య మేకాని 'వేమభూపాలుని గూర్చిన యిట్టి ప్రశస్తి ప్రస్తా పనశ్లోకములను శ్రీనాధాదు లీగ్రంథరచనయందు వేమభూపాలునికి దోడ్పడినవారగుటచేత ప్రఖ్యాతము లైన యాశ్లోకములనందుఁ జేర్పిం చియుందురు. అంతియగాని తానే రచించితినని లోకమనకొనవలయు నను తలంపుతో కోమటి వేముఁడు వానిని తన సాహిత్య చింతామణి యందుఁ జేర్చియుండఁడనియే నా యభిప్రాయము.

ఇంతియగాక పెదకోమటి వేమభూపాలుఁడు సంగీతచింతామణి యందు మఱియొక గ్రంథమును రచించెననియు నయ్యది తిరువనంతపుర ప్రాచ్య లిఖితపుస్త కథాండాగారమున నున్నదనియుఁ దత్పుస్తక పట్టికలో పేరును మాత్రము చూచినానని వారే తెలుపుచున్నారు.

శృంగారనైషధరచనాకాలము

ఆంధ్ర భాషలో రచింపఁబడిన యుత్తమ ప్రౌఢకావ్యములలో శ్రీనాథుని శృంగార నైషధ మొకటిగాఁ బరిగణింపఁ బడుచున్నది. కాశీఖండమయఃపిండం నైషధమ్ విద్వదౌషధమ్' అని విద్వాంసులు గొనియాడుచుందురు. శ్రీనాథుఁడు దీనిలో మొదట "సంతరించితి నిండు జవ్వనంబునందు హర్షనైషధ కావ్యమాంధ్ర భాష” నని నైషదమును