పుట:Srinadhakavi-Jeevithamu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతురాధ్యాయము

99


మభూపాలా ంకితము" అని వ్రాయుటకు నేవిధమైన సందేహమును బొందియుండ లేదు. కాని పెదకోమటి వేమభూపాలునిగూర్చి వీరికన్నియు సందేహము లే తోఁచుచున్నవి. మీకు రసార్ణ వసుధాకరగ్రంథమును బరిం చియున్న యెడల నింత సాహసముతో బైవాక్యములను రచించియుం డరు. 'పదవతరము సింగమనాయఁను పాండిత్య ప్రభావము చేతను, పండిత జనసమాదరణ చేతను కావ్య ప్రియత్వము చేతను, సర్వజ్ఞ నామమున కర్ణుఁడై పట్టు గన్పట్టునప్పుడు పెదకోమటి వేమభూ పొలుఁడు పై హేతు వులచేత సర్వజ్ఞ చక్రవర్తి బిరుదమున కర్హుడై నట్టు ఏలగన్పడకుండెనో చెప్పిన బాగుండునుగదా! రసార్ణన సుధాకరగ్రంథమును సింగమనాయ కుఁడు రచించెనని చెప్పుటకు సందేహము లేదు గాని 'పెదకోమటి వేమా రెడ్డి శృంగార దీపికను రచించెననుటకు సందేహము కలుగుచున్నదంట!

సాహిత్య చింతామణి

ఇయ్యది యలంకార శాస్త్ర గ్రంథములలోఁ బేర్కొనఁ దగినయుత్కృష్ట గ్రంథ ప్రభాకరశాస్త్రిగారు తెలుపుచున్నారు.ఈగ్రంథమును నేను కావున దీనింగూర్చి ప్రభాకరశాస్త్రిగారు వ్రాసిన వాక్యములనే యిట నుదహరించుచున్నా ను. " ఈ గ్రంథము కావ్య ప్రకాశమువంటిది. ప్రతాపరుదీయవ్యాఖ్యాత కుమారస్వామి సోమవీధి దీని నుదాహరించినాఁడు. మనుమభట్టు ననుమానము నిది ఖండించును. ధ్వన్యాలో కాదుల నీది పరామర్శించును. అమరుశతక శ్లోకములు పెక్కు లిందుదాహరింపఁబడినవి. మఱియు ననేక ప్రాచీన గ్రంథములలోని శ్లోకము లుదాహరింపఁబడినవి. 'యథామమైవకావ్యే అనియు, 'యథామమైవ కావ్యే వీరనారాయణ చరితే యనియుఁ బెక్కు శ్లోకము లుదాహరింపఁ బడినవి.కోమటి వేమకృతులగు నాగ్రంథము లిప్పుడు తెలియరావు. హామున భట్ట బాణునికృతి వీరనారాయణ చరితము గద్యగ్రంథము గలదు. జూచినవాడను బడినవి.