పుట:Srinadhakavi-Jeevithamu.pdf/105

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీ నా థ కవి


గన్పట్టుచున్నది. వేమభూ పొలుఁడు సంస్కృతాంధ్రములయందు మంచి పొండిత్యము కలవాడయినట్టు చెప్పుచున్నారు. అమరుకమను శృంగా రకావ్యమునకు సంస్కృతమున శృంగార దీపికయను వ్యాఖ్యానము నీతఁడు రచించెను. ఈ గంథరచనము నందు శ్రీనాథ వామన భట్టు లీతని సహాయులుగా నుండినట్టు కొందఱును శ్రీనాథుఁ డే గ్రంథమునంతను వేమభూపాలుని పేరు పెట్టి రచించేనని కొందఱును చెప్పుచున్నారు. శ్రీనాథుని శాసనములలోని శ్లోకములే భేదమించుకయు లేక సరిగా నిందుఁ గనఁబడుచున్నందున శ్రీనాధుఁడే శృంగార దీపికను రచించియుండును " అని యొక విచిత్ర వైఖరి నవలంబించి స్వాభిప్రాయమును వెల్ల డించిరి ఈ పెదకోమటి వేమభూపాలుని సర్వజ్ఞచక్రవర్తియని పొగడి నది వామనభట్టు మాత్రమే గాక శ్రీనాథకవికూడ పొగడియున్న వాడని పొన్నుపల్లి శాసనములోని


“చూడామణగ్నృపాణాం దుగ్మడపరిసంధి శిఖరిదఁ భోళి
సర్వజ్ఞ చక్రవర్తిపెదకోమటి వేభూపతిర్జయతి. "


అను చరణములే వేనోళ్ళఁ జాటుచున్నవి.

శ్రీవీరేశలింగముగారు'బేతాళనాయనికినేఁడవతరమువాఁడు సర్వజ్ఞసింగమనాయఁ డగుటకు సందేహము లేదు; రసార్ణవసుధాకరాది సంస్కృతగ్రంథములను రచియించినవాఁ యగుటకును సందేహము లేదు."అనియు, “ఎట్లుల వచ్చినను పదవతరము వాడైన యీసింగభూపాలుఁడు పాండిత్య ప్రభావముచేతను, పండితజన సమాదరణముచేతను "కావ్య క్రియశ్వముచేతను సర్వజ్ఞ నామమున కర్షు డై నట్లుకనుపట్టుచున్నాఁడు” అనియు, "ఇద్దఱును విద్వాంసులు కావచ్చున ఇద్దఱును కృతిపతులు కావచ్చును; ఇద్దఱు కు సర్వజ్ఞ బిరు వాంచితులుకావచ్చును" అనియు, ( మొదటి రసార్ణ వసుధాకరము; రెండవది చమత్కారచందిక; మొదటివి సింగభూ పాల విరచితము; రెండవది సింగ