పుట:Srinadhakavi-Jeevithamu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాధ్యాయము

97



దోడ్పడి యుండవచ్చును. అట్లుకాదేని పీఠిక భాగమును మాత్రము శ్రీనాథకవి రచించి యుండవచ్చును.•[1]

వీరేశలింగముగారు తమ కవుల చరిత్రములో ఈ పెదకోమటి వేమభూపాలు నియొద్ద శ్రీనాథుఁ డాంధ్రకవిగాను, పార్వతీపరిణయమును రచియించిన వామనభట్టు సంస్కృతకవిగాను ఉండిరి. సంస్కృతమున వేసుభూపాలీయమను పేర నీతని గూర్చియే యొక వచన కావ్యమును రచియించెను. వేమభూపాలీయమునందు భట్టీతనిని సర్వజ్ఞ చక్రవర్తునిగాను. ఈతని పూర్వులను మహాచక్రవర్తు లను గాను పొగడెను. వేమభూపాలునకుఁ దాను గ్రంథభర్తయగుట కంటె గ్రంధకర్తయగుటయం దెక్కున యిష్టముగలిగి యుండినట్టు


-

.

13

  1. రాజ్యం వేమస్సచికమకగాత్ ప్రాజ్య హేమాద్రి దానో భూమి దే వైర్భువ మురుభుశోభుక్త శేషామభుజ్క, శ్రీ శైలా గ్రాత్' ప్రభవతి పథి ప్రొత్త పాతాళం గంగా సోపానానీ ప్రమద పదవీమారుము క్షుశ్చ కార. మాచలక్షోణీపతి ర్మ హేంద్ర విభవో పేమక్షి తీశాగ్రజో హేమాద్రే సదృశోబభూవ సుగు ఆంతేస్తస్య త్రయో సందనా కీర్త్యాజూగ్రతి రేడిపోత సృపతి శ్రీకోమటీంద్రస్త తో సొగక్ష్మా పతి దిత్యుపాత్త పఫుషోధర్మార్ధ కామాఇవ."</poem> శృంగార పీఠిక లోని పై రెండు శ్లోకములు ఫిరంగిపుర శాసనములలో గలవు. పై రెండు శ్లోకములు మాత్రమె గాదు. శృంగార కీపిక లోని :.....

    "వేమాధికి చూచకభుశ్చ నందనో
    శ్రీకోమటీఘ్రస్య గుణైక సంశ్రయా
    భూలోక మేకోదరజన్మ వాఞయా
    భూయోవతీర్ణా వివరామ లక్ష్మణౌ”

    అను శ్లోక ముగూడా శ్రీనాథకవి విరచితమై పొన్ను పల్లి శాసన మునంగలదు. కాబట్టి అమరు వ్యాఖ్యాన పీఠిక భాగమును మాత్రము శ్రీ నాథకవి రచించి యుండవచ్చునని యు అమరు కావ్య వ్యాఖ్యను చూపము "పెదకోమటి వేమును పొలఁడే రచించి యుండుననియు విశ్వసింపవచ్చును.