పుట:Srinadhakavi-Jeevithamu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

శ్రీనాథ కవి


పారంగతుండును, మహాస్యా సామ్రాజ్య రక్షామణియు నగు సింగనామా త్యుఁడు ప్రధానమంత్రిత్వ పదవియందును, సున్న వారని తెలిసికొన్న ప్పుడు పెదకోమటి వేమభూపాలుఁడు మహాపండితుఁడు. మహారసికుఁ డునై యుండునని తెలిసికొనక మానము. అందుచేతనే కాఁబోలు పెద కోమటి వేమభూపాలునకు శ్రీనాథునివంటి విద్వాంసులచే 'సర్వజ్ఞ చక్ర వర్తి' యను బిరుద మీయఁబడినది. అభినవ భట్ట బాణ బిరుదాంచితుఁ డగు వామనభట్టుకూడ 'తానురచించిన వీర నారాయణ చరిత్రమను నా మాంతర ముగల వేమభూపాల చరిత్రమును. సంస్కత కావ్యమున బెదకోమటి వేమభూపాలుని 'సర్వజ్ఞ చక్రనర్తి'యని ప్రశంసించినాఁడు. శ్రీనాథుని శాసనకృతులందుఁగూడ.

 " చూడామణిగ్నృపాణాం
దుర్మద పుపంది శిఖదంభోళి?
సర్వజ్ఞ చక్రవర్తి
పెదకోమటి వేమభూపతి ర్జయతి.”

అని పేర్కొనబడి యుండుటయు నిందుకుఁ బ్రమాణములుగఁ జూప వచ్చును.

శృంగార దీపిక.

సప్తశతీసారటీక గాక 'శృంగారదీపిక' యను పేరిట శృంగార కావ్య మగు (సమరుశతకమునకు నొక జగత్ప్రసిద్ధమైన వ్యాఖ్య రచియిం చెసు. ఎన్ని వాఖ్యలు విరచింపఁబడినను, వానికంటెను వీని వ్యాఖ్య కే ప్రచార మెక్కువగాఁగలదు. ఇయ్యది విస్తరింపఁబడి చక్కగా వ్రాయఁబడినది. శ్రీనాథకవి ప్రణీతమైన ఫిరంగిపుర శాసనకృతిలోని రెండు శ్లోక ములు శృంగారదీపిక యందుండుటచేతను, శృంగార దీపికలోని మఱి యేకశ్లోకము శ్రీనాథకవి ప్రణీతమైన పొన్ను పల్లి శాసన కృతియందుం డుటచేతను శృగార దీపిక శ్రీనాథవిరచితమై యుండుసని కొందజు తలం . తురుగాని యీరచనమున శ్రీనాథకవి వేమభూపాలునకు.. నెక్కువగఁ