పుట:Srinadhakavi-Jeevithamu.pdf/102

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
95
చతుర్థాధ్యాయము


నెఱింగిన వారు, నాయుర్వేద మభ్యసించినవారు, దైవజ్ఞశిఖామణులు, వైయాకరణులు మొదలగువారెందరో సత్కారములం బడయ వచ్చుచుందురు. వారి యర్హతానర్హతల నిర్థారించుట కాయాపండిత ప్రకాండులతోడ సంభాషించినంగాని దేటపడునది కాదు. అట్లు సంభా షించుట కాయా విద్యలయందుఁ బావేశము గల వారికి మాత్రము సాధ్య మగునుగాని తదితరులకు సాధ్యముకాదు.


అట్టి సామర్థ్యము , ప్రతిభ, యోగ్యత శ్రీనాథునియందుఁ గల వను విశ్వాసముతోనే వయస్సునఁ చిన్న వాఁడని యెఱింగి యుండియు? బ్రభువు వానినే యమహోత్సవపదవి నధిష్ఠింపఁ జేసెను.. కనుకనే శ్రీనాథుఁడు గడు సామర్థ్యముతో నాపదవీ నిర్వహించి యావిద్యా పీఠ మున కధిక గౌరవము గలుగఁజేసి చిరకీర్తిని గడింపఁ గలిగెను. భీమే శ్వరపురాణకృతి పతియగు బెండపూడి అన్నమాత్యుఁడు;---


భాషించినాఁడవు బహుదేశ బుధులతో
విద్యాపరీక్షణ వేళలందు
వెదచల్లి నాఁడవు విశదకీర్తి స్ఫూర్తిన్
కర్పూరములు దిశాంగణములందు.”

అని తన్ను గూర్చి ప్రశంసించినట్లుగా శ్రీనాథుఁడు తన గ గ్రంథము జెప్పుకొనఁ గలుగుట సంభవించినది.

సర్వజ్ఞ చక్రవర్తి.

పెదకోమటి 'వేమభూపాలునీ యాస్థానంబుస సకలవిద్యాస నాధుఁడైన శ్రీనాథుఁడు విద్యాధికారి పదవియందును, అభినవ భట్ట బాణ బిరుదాంచితుఁడగు వామన భట్టాస్థాన కవిపదవియందును, ప్ర తాపగుణ భూషణుండును, పరిణ తీర్థ సంభాషణుండును, వితీర్ణ మహి మార్ణవుండును, విభపయోగ సంక్రందనుండును, పంచాగ స్థిరమంత రమణ కళాప్రౌడుండును, యవనాధీశ సభానిరంకుశ వచో వ్యాపార మునం