పుట:Srinadhakavi-Jeevithamu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

93

చతుర్ధాధ్యాయము


ఈపద్యమున కర్ణ సందర్భము సరిగా నూహింపనలవిగాక యున్నది. ఎన్వియో కొన్ని చిక్కులు గలిగినవని మాత్రము సూచించును. పెదకోమటి వేమభూపాలుఁడు 1400 మొనలు 1420 వఱుకు), ఇతఁడు పూర్వ రాజ మార్గానుసారముగా భూపాలనము గావించి తన జీవిత కాలమునంతయు విద్వద్గోషుతోడఁ గడపి చిరయశము సంపాదింప సంకల్పించుకొని కొండవీటి సామ్రాజ్యమున శాంతి ప్రబలి యుండుట కై మూఁడు సంవత్సరములు తన శక్తియుక్తులను దారపోసి సమర్థుఁడై ప్రజ్ఞావంతుఁడై , భూరిపరాక్రమమున వైరివీరుల ఘోరసం గ్రామముల నోడించి వీరనారాయణ బిరుదాంచితుఁ డై సఫలీకృతమనో రథుఁ డయ్యెనని చెప్పవచ్చును. ఆకాలమున నీతని పరాక్రమధాటి యెట్లుండెనో యీక్రింది శ్రీనాథుని చాటువువలన సువ్య క్తము కాగలదు.

 సీ. కపట కంఠీరవాకార సారాయణ
క్ష్మేళానినాదంబుఁ గేలి సేయు
కల్పాంత దుర్గాంత కాల భైరవ భేరి
ఢమరుకోన్మాదం బడంగఁజేయు
ప్రళయ కాలాభీల పటుఘోర నిర్ఘాత
పటపటారావంబుఁ జటులవ పఱచు
కహనా మహాకాల కోలాహలో త్తాల
పాతాళ నినధంబు భంగపఱచు

గీ. గండు మెఱన రిపుకోటి గుండెలవియ
దండగతి మోయు నీర ణోద్దండ భేరి
జయా రనూ సంగ రాజ వేశ్యా భుజంగా
అతుల బలధామ! పెదకోమటన్న వేమ ! "

పెదకోమటి వేముని విద్యావైభవము.

పెదకోమటి వేముఁడు పౌల్యమునుండియు సంస్కృతాంధముల విశేషముగాఁ గృషిచేసి , యసారమైన .పాండిత్యమును గూడ, సంపా