పుట:Srinadhakavi-Jeevithamu.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ప్రథమాధ్యాయము


బ్రయత్నించి పల్నాటి వీర చరిత్రములోని బాలచంద్రయుద్ధ భాగమునకుఁ బీఠిక వ్రాయునపుడు తమ నూతన సిద్ధాంతమునందు జొప్పించి యా గ్రంథమును బ్రచురించి యున్నారు.

మరియు సుప్రసిద్ధాంధ్రకవి కర్ణాట దేశీయుఁడనుట పలువురికి రుచింపకపోయినను మీదుమిక్కిలి నాకు నిష్టము లేకపోయినను యధార్ధముగ గనఁబడు చున్నది. నమ్మకపోవుట సంభవింప నేరదుగాన నాయభి ప్రాయము తెలుపుచున్నా' నని పలికి సత్యాన్వేషణ పరాయయణులగు 'వారీ యుంశ మునాలోచింపవలయుననియు కూడఁ బ్రార్థించియున్నారు. వీరు తమ వాదమునకు బలముగా నాలుగు 'హేతువులను గనఁబఱిచి యున్నారు శ్రీనాథుఁడు తన "కాళీ ఖండములో కర్ణాట దేశకటక పద్మవని హేళి' యను విశేషణమును జెప్పుకొనియుండుట మొకటిహేతువు. తన భీమేశ్వర పురాణములో నాకవిత్వంబు నిజము కర్ణాట భాష' యని చెప్పుకొనియుండుట రెండన హేతువు. మరియు తల్లీ!కన్నడ రాజ్యలక్ష్మి దయ లేదా? నేను శ్రీనాథుఁడన్' అని యొక చాటువులోఁ జెప్పుకొ నియండుట మూడవ హేతువు. శ్రీనాథుని తాత కనుల నాభామాత్యుని వారిధి తటీ కాల్పట్టనాధీశ్వరు' డని వచించుట నాలుగవహేతువు, ఈ హేతువులఁబట్టి ఉమాకాంతముగారు శ్రీనాథుని జన్మభూమి కర్ణాట దేశమని నిర్థారించుచున్నారు; కాని యివియన్ని యునుభ్రాంతీయంత్రమునం దగుల్కొని తిరుగాడుచుండిన బుద్ధివలన జనించిసట్టి యత్యద్భుతము లైన యుహలుగాని మఱి యొండుగావు. వీరి భావముల నోక్కొ క్కటిగాఁ దీసికొని జర్చించి సారమును గ్రహించి నపుఁడు యధార్థము దేట తెల్లము గాకమానదు,

కర్ణాట దేశ కటకపద్మననహేళీ' (అనగా గర్ణాటదేశాట్టణములను కమలములకు సూర్యుడు) అను విశేషణమును తనకుఁజేర్చుకొనినాడు గనుక జన్మస్థలమునందలి యభిమానము వలన నట్లు