ఈ పుట ఆమోదించబడ్డది
మనస్సుచేత తలపులనుండి జనించు ఆశల నన్నిటిని పూర్తిగ విడిచి, విషయములనుండి యింద్రియములు దూరముగ నుండునట్లు కట్టియుంచి, 6-24
శనై శ్శనై రుపరమే ద్బుద్ధ్యాధృతి గృహీతయా
ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్.
స్థిరబుద్ధితో మనస్సు ఆత్మయందు నిలిపి, రాను
రాను దానియందే లీనమగునట్లభ్యాసము చేయవలెను. ఎట్టి
చింతయులేక యుండవలెను. 6-25
యతో యతో నిశ్చరతి మనశ్చంచల మస్థిరమ్
తత స్తతో నియమ్యైత దాత్మ న్యేవ వశం నయేత్.
మనస్సు చంచలమై, స్థిరముగ నిలువక చలించునప్పు
డెల్ల దాని నడచియుంచి, యాత్మకు వశమునం దుంచ
వలెను. 6-26
ప్రశాన్తమనసం హ్యేనం యోగినం సుఖ ముత్తమమ్
ఉపైతి శాంతరజసం బ్రహ్మభూత మకల్మషమ్.
మనస్సు శాంతముగా, రజోగుణ మడగి, కల్మష
మును విడిచి, బ్రహ్మపదము నొందిన యోగికి ఉత్తమసుఖము
లభించును. 6-27
మనస్సు కుదిరికగొన్న వాడెట్లుండుననుదానిని క్రింద
చూడవచ్చును.