యాసనమునందు గూర్చుండి, యాత్మశుద్ధి యగునట్లు యోగమునందే నిలువవలెను. 6-12
సమం కాయశిరోగ్రీవం ధారయ న్న చలం స్థిరః
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశ శ్చా నవలోకయన్.
శరీరమును, తలను, కంఠమును సమముగా నుంచుకొని
స్థిరత్వమునొందినవాడై, తన ముక్కు కొనయందు దృష్టిని
నిలిపికొని, యిటునటు చుట్టును చూడకయుండవలెను. 6-13
ప్రశాన్తాత్మా విగత భీర్బ్రహ్మచారివ్రతే స్థితః
మన స్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః.
ప్రశాంతముపొందినపిదప, భయమనుదానినిపొందక,
బ్రహ్మచర్యవ్రతమున నెలకొని, మనస్సునడచి, నాయందు
చిత్తమునునిలిపి, నన్ను బొందినయోగముననుండవలెను. 6-14
నాత్యశ్న తస్తు యోగో౽స్తినచైకాంత మనశ్నతః
న చాతిస్వప్న శీలస్య జాగ్రతో నైవ చార్జున.
ఎక్కువగా తినువానికి యోగములేదు. ఎక్కువగా
ఉపవాసములు చేసినను ఫలములేదు. మిక్కిలిగ నిద్రపోవు
వానికిని యోగము కలుగదు. అట్లే నిద్రను విడిచిననుఫలము
లేదు. 6-16
యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు
యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా.