Jump to content

పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొనక మనోవికారమునుబొందక యుండుటకు అలవాటు చేయునపుడు, ఏకాంతముననుండి చిత్తమాలిన్యములను విడిచి, ధ్యానములో నిలుచుటచే మనస్సునకు స్థిరత్వము గలుగును. ఇట్టిధ్యానమునభ్యసించుట క్రింద చూపిన శ్లోక ములలో 'యోగ' మని చెప్పబడుచున్నది.


యోగీ యుంజీత సతత మాత్మానం రహసిస్థితః
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీ రపరిగ్రహః.


నిర్జన ప్రదేశమున ఏకాంతముగనుండి, మనస్సును ఎల్లప్పుడు వశముచేసికొని ఆశను, వస్తువులను సంపాదింపవలెనను కోరికను విడిచి యోగము నభ్యసించుచుండవలెను. 6-10


శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసన మాత్మనః
నాత్యుచ్ఛ్రితం నాతినీచం చేలాజినకుశోత్తరమ్.


శుద్ధమైనస్థలములో నెక్కువ యెత్తుగ గాని, మిక్కిలి క్రిందుగగాని యుండని యొక స్థిరమైనయాసనము నేర్పరచు కొని బట్ట, జింకతోలు, దర్భ వీనిని పరచుకొని కూర్చుండ వలెను. 6-11


తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః
ఉపవిశ్యాసనే యుంజ్యా ద్యోగ మాత్మ విశుద్ధయే.


మనస్సు నొక ముఖమునకు దెచ్చి, మనస్సును, నింద్రియములును చేయుపనులను స్వాధీనమునందుంచుకొని,