కార్యమునకును నేర్పడియున్న మార్పులేని బంధమొకప్రక్క మనకున్నను, అదే మనకు కర్మస్వాతంత్య్రమును తెచ్చుచున్నది.
జగత్సష్టియు, స్థితియు నీశ్వరునినుండియే వచ్చును. ప్రకృతి యనునదతని పనిముట్టు అని క్రిందచూపిన శ్లోక ములు తెలుపుచున్నది.
యథా౽కాశ స్థితో నిత్యం వాయు స్సర్వత్రగో మహాన్
తథా సర్వాణి భూతాని మత్ స్థానీ త్యుపధారయ.
అన్ని చోట్లను వీచుటకు మహాబలముగల గాలి ఎట్లె
ప్పుడును నాకాశమున నెలకొని యున్నదో, అట్లే భూతము
లన్నియు నాలో నెలకొనియున్నవని తెలిసికొనుము. 9-6
ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః
భూతగ్రామ మిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్.
నాకు లోబడిన ప్రకృతియందు నిలిచి మరల మరల
భూత సంఘమునంతటిని స్వభావబలముచేత నుండునట్లు
చేసెదను. 9-8
మయా౽ధ్యక్షేణ ప్రకృతి స్సూయతే సచరాచరమ్
హేతునా౽నేన కౌంతేయ జగద్వి పరివర్తతే.
నాయధ్యక్షత్వమున ప్రకృతి చరాచరలోకములను
సృష్టించును. ఈహేతువుచేత లోకము చుట్టిచుట్టి తిరుగు
చున్నది. 9-10