మమై వాంశో జీవలోకే జీవభూత స్సనాతనః
మన ష్షష్ఠా నీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి
నాకిరణ మొకటి జీవలోకమునచేరి యచ్చట జీవాత్మయై,
యైదింద్రియములను, ఆరోఇంద్రియమైన మనస్సును
కూడికొని నిలుచుచున్నది 15-7
శరీరం య దవాప్నోతి యచ్చా ప్యుత్క్రామ తీశ్వరః
గృహీ త్వైతాని సంయాతి వాయుర్గంధా నివాశయాత్.
అక్కడక్కడ నుండు పరిమళములను గ్రహించి గాలి
చలించునట్లు, యజమానుడైన యాత్మ యేదో యొకదేహ
మును బొందునప్పుడును, విడుచునప్పుడును పూర్వవాసనలను
గ్రహించుకొని తిరుగుచుండును. 15-8
శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణ మేవ చ
అధిష్ఠాయ మనశ్చాయం విషయా నుపసేవతే.
వినుట, చూచుట, తాకుట, రుచిచూచుట, మూచూ
చుట, వీనిని గూర్చిన ఇంద్రియములలోను, మనస్సులోను,
నెలకొని జీవుడు విషయముల ననుభవించుచున్నాడు. 15-9
ఒకజీవుని పరిణామమతనిచేతిలోనే యున్నది. మంచి కర్మమును చెడుకర్మమునుచేసి తనకు తానేమంచిని చెడుగును తెచ్చుకొనుచున్నాడు. ఆత్మ ఉత్తమాధమపదములకు పోవు మార్గమాతడేర్పరుచుకొన్నదే. ఈయాధారమును స్వాతంత్య్ర