Jump to content

పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుబంధము 1.

గీత: విశ్వమాత.

(గాంధి మహాత్ముడు.)

(గాంధిమహాత్ముడు కాశిలో విద్యార్థులకు హిందీభాషలో నిచ్చినయుపన్యాసమున కీక్రింది దనువాదము.)


జీవితములో కలుగుకష్టములనుండియు, మోహముల నుండియు తప్పించి సరియైనదారిచూపగల యొక మతగ్రంథ ముండుట యావశ్యకమని నాకుచిన్నతనములోనే తోచినది. వేదములను చదువుదమన్న కాశివంటి విద్యాస్థానములో పదునేను పదునారు సంవత్సరములైనను చాలకష్టపడవలెను. అప్పుడు నాకు వేదాభ్యాసము చేయుట కవకాశము చిక్కక పోయినది. కాబట్టి వేదములు నాకందరానివయినవి. కాని సమస్తశాస్త్రములు, ఉపనిషత్తులలోని సారమంతయుగీతలో నేడువందలశ్లోకములలో నిమిడియున్నదని నేనెక్కడనోచదివి యుంటిని. వెంటనే నిశ్చయము చేసికొంటిని. గీతను చదువుటకు ముందుగా సంస్కృతమును నేర్చుకొంటిని. నేడు గీత నాకు బైబిలు, ఖురానులవంటిది మాత్రము కాదు:- అది అంతకంటె ఉత్తమమైనది, అది నాకు తల్లి. నాకు దేహ