ఈ పుట ఆమోదించబడ్డది
అప్పుడు పలువిధములుగ నున్న జగత్సృష్టియంతయు, నాదేవదేవుని శరీరమున నొకచో గూడి నిలిచియుండుటను పాండవుడు చూచెను. 11-13
అర్జునునిస్తుతి :-
అర్జున ఉవాచ:-
పశ్యామి దేవాం స్తవ దేవ దేహే
సర్వాం స్తథా భూతవిశేషసంఘాన్,
బ్రహ్మాణ మీశం కమలాసనస్థం
ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్.
దేవా! నీదేహమున ఎల్లదేవతలను ప్రాణికోట్లను
కమలాసనమున గూర్చున్నబ్రహ్మను, యీశుని, ఎల్ల ఋషులను,
దివ్యసర్పములను, చూచుచున్నాను. 11-15
అనేక బాహూ దర వక్త్రనేత్రం
పశ్యామి త్వాం సర్వతో నంతరూపం,
నాంతం నమధ్యం నపున స్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప.
అనేక బాహువులు, ఉదరములు, వక్త్రములు, అనేక
నేత్రములునుగల మేరలేని నీరూపమును అన్ని దిక్కులందును
చూచుచున్నాను. అన్నిటికి నీశ్వరుడా ! విశ్వమును నీరూప