ఈ పుట ఆమోదించబడ్డది
చురుకుగలవియు, విదాహమును గలిగించునవియు నగునాహారములను రజోగుణము కలవారు కోరుదురు. ఇవి దుఃఖము, శోకము, రోగము, వీనికి కారణమగును. 17-9
యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం.
ప్రాచిది, రసహీనమైనది, కంపుకొట్టినది, రాత్రియంతయు
నిలువనుంచినది, ఎంగిలి, అశుద్ధమైనది. ఇట్టి యాహారములందే
తమోగుణముకలవారు ప్రీతినిచూపుదురు. 17-10
ఇవి వేలకొద్ది సంవత్సరములక్రింద వ్రాయబడిన శ్లోకములని
జ్ఞాపకముంచుకొని, వీనిసారాంశమును గ్రహించి, దిన
దినజీవితమును గడపుకొనవలెను.
(24)
ప్రపత్తి.
(గీత: అధ్యాయములు 9, 10, 12, 14, 18)
అవ్యక్తబ్రహ్మమును ధ్యానించుట కష్టము. సర్వ
కళ్యాణగుణములును గల సర్వేశ్వరు నుపాసించుటే సులభమైనమార్గము.
కర్మయోగమార్గమున చెప్పినట్లు స్వలాభము