29
యు ద్ధ కాం డ ము
కావలసిన మస్త - కములు గొట్టించి
కావళ్లఁబట్టించి - కపుల రాఘవుల 640
పేరుడ మాపుదు ”నన్న - పెట పెటపండ్లు
-: పై వారి మాటలు విని రాక్షసులు చెల రేఁగుట : -
కోఱలు మెఱయంగఁ - గొఱకుచు లేచి
మీసముల్ వడివెట్టి - మిడిగ్రుడ్ల వెంట
రాసులై నిప్పులు - రాల రోజుచును
కుంతముల్ చిమ్ముచు - గుమిగాఁగలేచి
పంతంబులాడుచుఁ - బదరి యొండొరుల
మొనసి నికుంభ దు -ర్ముఖులగ్ని కేతుఁ
డును గుంభుఁడుఁ బ్రహస్తుఁ - డును నింద్రజిత్తు
యజ్ఞకోపుఁడును మ - హాపార్శ్వధూమ్రు
లజ్ఞానులగు విరూ - పాక్షకంపనులు 650
రుధిరాక్షుడు మహోద -రుఁడు రశ్ని కేతుఁ
డధిక శౌర్యుండు ధూ - మ్రాక్షుఁడు సూర్య
శత్రు సుప్తఘ్న దు - ర్జయ వజ్రదంష్టు
లుత్రిలోచనరుద్రు - లును నాగ్రహించి
పరిఘపట్టిస ధను - ర్బాణాసిముసల
కరలౌచు నతిభయం - కరులౌచు మండి
శూలంబు లార్పుచుఁ - జూచి రావణుఁడు
చాల మెచ్చఁగ నొక - సరణి నిట్లనిరి.
-: రావణుఁడు సూక్ష్మముగా వారిమాటలను వినుట :-
"సూక్మవిచారద - క్షులు సభ లేరు
లక్ష్మణసుగ్రీవు - లను రామవిభుని 660