27
యు ద్ధ కాం డ ము
మచ్చుఁ గప్పింపుచో - మబ్బులనుండి
వానరావళినెల్ల - వధియింతు నంత
దీనులై యెవ్వడు - దిక్కు లేకున్న
నాచేత దశరథ - నందనుల్ దగుల
రాచబీరముల నూ - రక యెదుర్పుదురు! 600
ఆ వేళ వారినే - నదటడంగించి
దేవ ! నీఖేదంబుఁ - దీర్చెద” ననినఁ
గుంభకర్ణుని పెద్ద - కొడుకాగ్రహమునఁ
గుంభుఁడన్ వాడు ర - క్షోనాథుఁ బలికె
--: కుంభుని కువాళకములు :-
మీ రేలఁ గోతుల - మీఁదను నలుగ
నీరావణునిఁగాచి - లంకలోన
వసియింపుఁడేఁ బోయి - వనచరావళిని
దెసచెడ నుగ్గాడి - తిత్తులొల్పించి
భానుజాంగదనల - పవనసమీర
సూనుల దశరథ - సుతులను జంపి 610
గెలిచి వచ్చేద”నన్న - గీటుచుఁ బండ్లు
సెలవులు నాకుచు - సెలవునాకనుచు
నాగ్రహాంబున యజ్ఞ - హనువనువాఁ డు
దగ్రుఁడై తాలేచి - దశకంఠుఁ బలికె.
-: యజ్ఞహనుని యసందర్భపు మాటలు :-
"ఆలోచనలు మమ్ము - నడిగినచోట
కాలోచితంబై న - కార్య మూహించి