26
శ్రీ రా మా య ణ ము
అనుమతియే ?” యన్న - నౌడులు గఱచి
దనుజేంద్రుతో వజ్ర - దంష్ట్రుఁడు వలికె
-: వజ్రదంష్ట్రుని వాక్యములు :-
గదచూడు మిదియే రా - ఘవులకువైరి
యిదిగదా కపులకు - నెల్లను మిత్తి!
నాకుఁ గోపముపుట్టె - నా తాళఁజాల
వాకొమ్ము పొమ్మని - వారి మీఁదికిని
యీపరిఘంబుపై - యేఁ దెంపు సేయ
నేపరకుందురే - యింద్రాదులైన 580
గడియలోపల లంకఁ - గెలిచి తోఁక
మెడమీఁద వేసుక - మింటికి నెెగసి
యాకోఁతి పరువెత్తె - నని యింతలోన
నీకేవిచారమే - మిటికేను గలుగ ?
నొక్కపెట్టున వారి - నుర్విపాల్ జేసి
యుక్కుతో మరలి రా - నోపుదు నిపుడు !
లంకాధినాథ! యే - ల ప్రయత్నమింత ?
ఇంక నొక్కయుపాయ - మిచ్చ నెంచితిని
మనుజమూర్తులతోడ - మాయలు నేర్చు
దనుజులఁ గొందఱ - దశరథాత్మజులఁ 590
జేరఁ బంపినవారు - చేతులు మొగిచి
'యోరామ ! భరతుఁడ - యోధ్యాపురంబు
వెడలి సేనలతోడ - విచ్చేసి మిమ్ముఁ
బొడఁగని పోవ ము - నుపుగ మేముగదలి
వచ్చితి” మని కొన్ని - వార్తలాడించి