25
యు ద్ధ కాం డ ము
-: ప్రహస్తుని పలుకులు :-
"సెలవిండు నాకెంత - సేపు ? సుగ్రీవు
తలఁ దెచ్చి నీదుముం - దఱ నిప్పుడునుతు!
భూమి యవానరం - బుగఁ జేసికాని
నీముందఱికి వచ్చు - నే ప్రహస్తుండు ?
ఊరెల్లఁ గాలిచి - యొక క్రోఁతి వోవ
నూరికే యేమఱి - యుంటి మప్పటికి
ఇంతటిలోన నీ - కేమి కొఱంత ?
ఎంత కొంచెముగాఁగ - నెంచితి మమ్ము!
మనుజులు నాకెంత - మర్కటు లెంత ?
దనుజేంద్ర ! మీకు నిం - తవిచార మేల ? 560
ననుఁజూడు ” మన దశా - ననుఁ దేఱి చూచి
మొనగాఁడు లేచి దు - ర్ముఖుఁడిట్లు వలికె
-: దుర్ముఖుని దురుక్తులు :-
"ఈ దేవర చిత్తంబుఁ – దెలియక పదరి
యావేళ నేమియు – ననలేక యుంట!
నను నెదురింప నీ - నరులు వానరులు
మనసునఁ దలఁప స - మర్థులు గారు.
ఏనుదాఁజూచి వా - రెందు వాఱినను
పోనీను గందరం - బులు దూరిరేని
పాతాళ బిలములో - పలఁ జొచ్చిరేని
చేతుల తీఁటవో - చెండి వేయదును! 570
త్రాటను సుగ్రీవుఁ - దాఁగట్టి తెత్తు
మాటమాత్రముగాదు - మాటమాత్రమున !