19
యుద్ధ కాండము
బడలువానికిఁదావి - పానకంబబ్బు
వడువుగదా సీత - వాతెఱ తనకు ! 410
మాలూర ఫలముల - మఱపించు సీత
పాలిండ్లు కెంగేలఁ - బట్టుదు నొక్కొ?
తనవంటి పతి గల్గి - ధరణిజ యిటుల
దనుజాంగనలు చుట్టుఁ - దను గాచియుండ
ననదయై యుండునె ! - యాయింతి తండ్రి
జనకుఁడు మామ కౌ - సల్యావరుండు
శారదసమయ ని - శాచంద్రరేఖ
వారిదంబుల నెడ - వాసిన రీతి
దనుజంగనా నిరో - ధము లొనరించి
ననుజేరఁ రాఁగ నె - న్నడు జూడఁగలనొ ? 420
జవరాలు కడుపలు - చని మేనిదెపుడు
నవనిజ యిపుడు పే - రాఁకట నలఁగి
యెంత కృశించెనో ? - యెదురుగావచ్చి
యింతి కౌఁగిటఁ జేర్చు - టెన్నఁడోయింక ?
మైలచేల వదల్చి - మణుఁగు ధరించు
పోలిక మదిఁ గొని - పొరలు ఖేదంబు
చాలించి జానకి - సంగరసాబ్ధి
నోలలాడుచు నుందు - నొకొయొక్కనాఁడు"
అనుచు సంధ్యాదిక్రి - యాకలాపంబు
లనుజునితోఁ గూడి - యా రేయిఁ దీర్చి 430
సముచిత గతులచే - సాగర తీర
రమణీయ మహి రఘు - 'రాముఁ డున్నంత