15
యుద్ధ కాండము
వనచరు లు త్సాహ - వంతులై నారు !
మన గెల్పు రావణు - మరణంబె నిజము !
అవనిజతో నయో - ధ్యాపురిఁ జేరి
యవిరళ సౌఖ్యంబు . లందఁ జాలుదువు ” 320
-: శ్రీరాముడు సముద్రము దరిఁ జేరుట :-
అని యన్న నూరార్చి - యరుగుచోఁ ద్రోవ
వనజాకరములఁ బా - వన వనంబులను
చరులను గందర - సానుభాగముల
సురసిద్దచారణ - సుందరీమణుల
శ్రవణమంగళ గాన - సంచరద్భ్రమర
నివహంబులను మృగ - నికరంబు చేత
యమరు సహ్యాద్రిఁ బా - యని మలయాద్రి
క్రమియించి యవ్వలఁ - గనుపట్టుచున్న
హేమధాతువుల మ - హేంద్రాచలంబు
రామసౌమిత్రులు - రవికుమారకుఁడు
కపులునుఁ జేరి యా - గట్టు పై నెక్కి
యపుడు గన్గొనిరి మ - హాసాగరంబు !
ఆజలనిధిఁ గాంచి - యవనిజప్రియుఁడు
రాజీవహిత కుమా - రకుఁ జూచి పలికె 330
--: శ్రీరాముఁడు వానరులతో సముద్రపుటొడ్డున నిమ్మైనచోట పాళెమువిడియుట :-
రేవగల్గాఁగఁ జే - రితిమి వారాశి
(కేవకుఁ బైనేరి - కినిఁబోవరాదు.