పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

జివ్వఁజాలించి వచ్చిన త్రోవప్రజలు
నవ్వఁగఁ బరువెత్తి నలినాప్తసుతుఁడు
ఊరక యంగదుం డూడని బాఱె
దారిఁదప్పినఁ బోయెఁ దారుఁడు దీసి
పోక నిల్చి సమీరపుత్రుండు వడియె
మోకాళ్లువిఱిగి రాముని బాయలేక
కుముదుఁడు తలతెగఁగొట్టినఁ బడియె
సమసె మైందుఁడు నీఁగి చనియె నలుండు
నీలుఁడు శరభుఁడు నిలిచిపోరాడి
వ్రాలిరి మేనులు వ్రయ్యలై భువిని
పనసుఁ డెఱింగి దబ్బఱవచ్చె ననుచుఁ
బనసచెట్టును బోలి బ్రమసితానిలిచెె
నాలంబులోన గవాక్షుండుఁ గూలె
చేలకయ్యము చేసి శతవలి మడిసె
నెత్తురుఁ గ్రక్కుచు నెగ్గె సుషేణుఁ
డుత్తరంబున ధూమ్రుడుదధి లోఁబడియె
చేయెత్తిమ్రొక్కఁ గూల్చిరి దధిముఖుని
మాయచేఁ గేసరిమై డాసిపోయె
సేతువు చూడవచ్చిన కపులెల్ల
భీతిచే నిల్లాండ్ర బిడ్డలఁ దలఁచి
ముగిసె కార్యంబని మొదలి టెంకులకుఁ
దగఁ దొట్టి పాఱిన దైత్యులు తఱుమ 2952-2977


రంగనాథ రామాయణము (అనుబంధము 1, పుట 678)

ద్వి. ... ... వగచుచునుండఁ
     దప్పించుకొని పాఱెఁ దా విభీషణుఁడు
     చుప్పనాతికి ముక్కుసురియ చేఁ గోయు
     నాపాపమునఁ బాఱెనపుడు నీమఱఁది