ఈ పుట ఆమోదించబడ్డది
114
శ్రీ రా మా య ణ ము
-: హనుమంతుఁడు :-
వాసవుఁ జేరిన - వరుణునిఁ బోలి
యాసమీరకుమారఁ - డవనిజాప్రియునిఁ
బాయక యాతని - పనిఁబూని వచ్చి
నీయూరుఁ గాలిచి - నిలువక పోయి
యిందఱిఁదోడుక - యిచటికిఁ దెచ్చి
యందున్న వాఁడల్ల - హనుమంతుఁజూడు.
-: నీలుఁడు :-
పదికోట్ల వానరుల్ -పజ్జలఁ గొల్వ
నెదురుగా లంకపై - దృష్టులు నిలిపి
తానె వారధిఁ గట్టి - దర్పించియున్న 2550
యానీలుఁ జూడు మా - యతభుజబలుని.
-: శ్వేతుఁడు :--
వెండి కొండయుఁ బోలి - శ్వేతుఁడనంగ
నుండు వానరుఁజూడు - మురుశౌర్యనిధిని
నిలిచి యాసుగ్రీవు - నికిఁ గేలు మొగిచి
తిలకింపుగోమతీ - తీరమీయనది
-: కుముదుఁడు :-
యటుచూడు సంకోచ - కాహ్వయ శైల
కటకనివాసునిఁ - గామసంచారుఁ